తమ ముఖ చర్మం తెల్లగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.కానీ పోషకాల కొరత, ఎండల ప్రభావం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం తదితర కారణాల వల్ల కొందరి చర్మం రోజురోజుకు డార్క్ గా మారుతూ ఉంటుంది.
దాంతో స్కిన్ విషయంలో తెగ హైరానా పడిపోతుంటారు.ఈ క్రమంలోనే గూగుల్ లో తెగ సెర్చింగ్ చేసి ఖరీదైన స్కిన్ వైట్నింగ్ క్రీమ్, సీరంలను కొనుగోలు చేసి వాడుతుంటారు.
కానీ సహజంగా కూడా చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ రెమెడీ సూపర్ ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ ఫీల్ పౌడర్ వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, నాలుగు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, ( Lemon juice )వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మరియు రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ( Curd )వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఆపై మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.
ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే చర్మ ఛాయ మెరుగుపడుతుంది.స్కిన్ పై పేరుకుపోయిన డస్ట్, డెడ్ స్కిన్ సెల్స్( Dead skin cells ) తొలగిపోతాయి.
చర్మం కాంతివంతంగా, ప్రకాశవంతంగా మెరుస్తుంది.కాబట్టి చర్మం రోజురోజుకు డార్క్ గా మారుతుందని వర్రీ అవుతున్నవారు, సమజంగా చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలని భావించేవారు ఈ రెమెడీని తప్పకుండా ప్రయత్నించండి.
బెస్ట్ రిజల్ట్ మీ సొంతం అవుతుంది.