2027 నుంచి అమల్లోకి మహిళా రిజర్వేషన్ల బిల్లు..: పురంధేశ్వరి

మహిళా రిజర్వేషన్ల బిల్లు చరిత్రాత్మకమైనదని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు.ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు 2027 నుంచి అమల్లోకి వస్తుందని ఆమె తెలిపారు.

 Women's Reservation Bill To Come Into Effect From 2027: Purandheswari-TeluguStop.com

అనంతరం ఏపీలో పొత్తులపై స్పందించిన పురంధేశ్వరి పొత్తులు ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు నిర్ణయిస్తామని చెప్పారు.ప్రస్తుతానికి జనసేన పార్టీతో పొత్తులోనే ఉన్నామని స్పష్టం చేశారు.

టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పారన్నారు.అయితే పవన్ నిర్ణయంపై తమ పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

అదేవిధంగా చంద్రబాబుపై కేసు పెట్టింది తాము కాదని సీఐడీ అని తెలిపారు.రాష్ట్రంలో ఏం జరిగినా బీజేపీకి ఆపాదిస్తున్నారని మండిపడ్డారు.

కక్షపూరిత రాజకీయాలను బీజేపీ సమర్థించదన్న పురంధేశ్వరి పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేంద్రమే ఇస్తుందని, అయితే ఆ నిధులను వైసీపీ ప్రభుత్వం సక్రమంగా ఖర్చు చేయడం లేదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube