గుంటూరు: జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న చంద్రబాబు సభ తొక్కిసిలాట బాధితులను పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.వాసిరెడ్డి పద్మా కామెంట్స్.
కొత్త ఏడాది రోజు దారుణ సంఘటన ఇది.ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం, ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు.మరణించినవారికి సానుభూతి తెలియజేస్తున్నా.చంద్రబాబు డైరెక్షన్ లో జరిగిన సభ ఇది.దీనిపై మహిళా కమీషన్ గుంటూరు ఎస్పీని నివేదిక కోరాం.ప్రభుత్వానికి కూడా జరిగిన వాస్తవాలను వివరిస్తాం.
కచ్చితంగా చంద్రబాబు దీనిపై బాధ్యత వహించాలి.కొంత మందికి ఇళ్ల దగ్గర టోకెన్లు ఇచ్చారు, కొంత మందికి మీటింగ్ దగ్గర టోకెన్లు ఇస్తామని పేదలను మబ్యపెట్టారు.
చేసిన ప్రచారానికి తగ్గట్టు సభ వద్ద సరైన ఏర్పాట్లు లేవు.కందుకూరు ఘటనకు కారణమైన చంద్రబాబు అ సభకు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు.
ప్రచారం పెద్ద ఎత్తున చేసారు.చనిపోయిన వారంత నిరుపేద కుటుంబీకులు.ఇచ్చే కానుక చిన్నది ఐనా పేదలు ఎక్కువగా వచ్చారు.చంద్రబాబు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారు.రాజకీయ లబ్దికోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.టిడిపి తప్పు చేసి తిరిగి ఎదిరుదాడి చేస్తోంది.సహాయం చేస్తున్నమనే నెపంతో పేదలను ఇంకా చులకనగా చూస్తున్నారు.200 విలువలేని నాసిరకం వస్తువులతో ప్రజలను మోసం చేసారు.సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క పేద కుటుంబానికి లక్ష నుండి రెండు లక్షలు అందాయి.బటన్ నొక్కి బాధితుల అకౌంట్లలోకే నగదు వెళ్లింది, సీఎం జగన్ వల్ల ఎవరి వల్ల ప్రాణాలు కోల్పోలేదు.
ఇళ్ళలో కూలిపనులు చేసుకునేవారు ఏదో ఇస్తారనే వస్తే మృతికి కారణమైయ్యారు.