ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మందగమనంలో ఉంది.దీంతో టెక్ దిగ్గజాలు పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఆర్థిక మాంద్యం రాబోతుందనే అంచనాలతో పలు టెక్ సంస్థలు ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి.ఈ క్రమంలో ప్రముఖ ఐటి సంస్థ విప్రో ఫ్రెషర్స్‌కి కోలుకోలేని షాక్ ఇచ్చింది.
అధిక వార్షిక వేతనం ఆఫర్ చేసిన ఫ్రెషర్లకు ఝలక్ ఇచ్చింది.

వారు సగం జీతంతో ప్రాజెక్టులపై పని చేయాలని సూచించింది.ఈ విషయాన్ని ఫ్రెషర్లకు ఇ-మెయిల్ ద్వారా సమాచారం పంపింది.ఈ ఆఫర్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన ట్రైనీలకు అందింది.రూ.3.5 లక్షల వార్షిక జీతంతో వారు ఒక ప్రాజెక్ట్‌లో పనిచేస్తారా అని కంపెనీ ఇమెయిల్ ద్వారా అడిగింది.అయితే, అంతకుముందు అతనికి వార్షిక ప్యాకేజీ రూ.6.5 లక్షలు ఇవ్వబడింది.

2023 ఆర్థిక సంవత్సరంలో వెలాసిటీ గ్రాడ్యుయేట్ కేటగిరీ కింద ఉంచిన విప్రో ఆ ఫ్రెషర్లందరికీ ఈ ఆఫర్ ఇచ్చింది.వ్యాపార అవసరాల కారణంగా మేము మా నియామక ప్రణాళికలను మార్చామని, ఇంతకుముందు చేసిన బెస్ట్ ఆఫర్‌ను తాము గౌరవిస్తామని విప్రో పేర్కొంది.కానీ పరిస్థితులు ప్రస్తుతం ప్రతికూలంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.తామిచ్చి ఆఫర్ ఫ్రెషర్లకు కెరీర్‌ను వెంటనే ప్రారంభించడానికి, నైపుణ్యాన్ని సాధించడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి అవకాశాన్ని ఇస్తుందని వివవరించింది.
ఫిబ్రవరి 20 నాటికి జీతంలో ఈ మార్పును అంగీకరిస్తూ కొందరు అభ్యర్థులు నిర్ణయం తీసుకున్నారు.అయితే విప్రో తీసుకున్న ఈ నిర్ణయం మరిన్ని కంపెనీలు అమలు చేసే ప్రమాదం ఉందనే అంచనాలు ఉన్నాయి.
ఇదే కార్యరూపం దాల్చితే చాలా మంది ఉద్యోగులు సగం జీతానికే పని చేయాల్సి వస్తుంది.