టి.బీజేపి : నేతల్ని పరుగులు పెట్టించేస్తున్నారే ? 

తెలంగాణ బిజెపి నేతలని ఆ పార్టీ అధిష్టానం కుదురుగా ఉండనివ్వడం లేదు.టాస్కులు మీద టాస్కులు ఇస్తూ,  పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్ లను వేస్తూ, వాటిని అమలు చేయాల్సిందిగా పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేస్తుంది.

 T.bjp: Are You Making The Leaders Run ,bjp, Trs, Brs, Telangana,sunil Bansal, Ta-TeluguStop.com

ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఇక పార్టీ నాయకులంతా మిగతా వ్యవహారాలను పూర్తిగా పక్కన పెట్టి , రాజకీయంగా యాక్టివ్ గా ఉండాలని పదేపదే సూచిస్తుంది.దీంతో పాటు,  నాయకులందరినీ భాగస్వామ్యం చేసే విధంగా పార్టీ కార్యక్రమాలు రూపొందిస్తుంది.

ఇప్పటికే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ భారీగా చేయిస్తోంది.మరో రెండు , మూడు రోజుల్లో ఆ కార్యక్రమం ముగియనుంది.

దీంతో మరో కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు.స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ముగిసిన వెంటనే బూత్ స్వశక్తికరణ్ పేరుతో మరో కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు.పార్టీని బూత్ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఉపయోగపడతాయని,  అలాగే స్వశక్తికరన్ కార్యక్రమం తో పాటు,  పోలింగ్ బూత్ లను బలోపేతం పైన బీజేపీ అగ్ర నేతలు దృష్టి సారించారు.ఇక ప్రస్తుతం పోలింగ్ బూత్ ఇన్చార్జిల నియామకం,  బిజెపికి ఇబ్బందికరంగా మారింది .

Telugu Congress, Sunil Bansal, Tarun Chugh, Telangana, Telangana Bjp-Politics

స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లతో పార్టీని ప్రతి ఇంటికి చేర్చడంపై నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.అలాగే బూత్ స్వశక్తి కరణ్ ద్వారా పోలింగ్ బూత్ ల వారిగా కమిటీలు వేసి భవిష్యత్తులో పార్టీ బలాన్ని పెంచాలని బిజెపి హై కమాండ్  భావిస్తోంది.అందుకే బూత్ స్థాయి కమిటీల ఏర్పాటుతో పాటు,  స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, సరల్ యాప్ పైనా బిజెపి అధిష్టానం దృష్టి పెట్టింది.ఇప్పటివరకు కమిటీల ఏర్పాటు ,  స్వీట్ కార్నర్ మీటింగ్ లు ఎన్ని నిర్వహించారు.

ఎలా నిర్వహించారు అనే దానిపైన సమీక్ష నిర్వహించబోతోంది.

Telugu Congress, Sunil Bansal, Tarun Chugh, Telangana, Telangana Bjp-Politics

అలాగే ఎంతమంది పేర్లను అప్డేట్ చేశారు అనే అంశాల పైన బీజేపీ దృష్టి పెట్టింది.తెలంగాణ బిజెపి ఇన్చార్జి సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్ తో పాటు , సహ ఇంచార్జి అరవింద్ మీనన్ తెలంగాణకు రాబోతున్నారు.రాష్ట్ర పదాధికారులు , అన్ని జిల్లాల అధ్యక్షులు, ఇన్చార్జీలతో వారు భేటీ కాబోతున్నారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బిజెపి ఇప్పుడు సమీక్షలు నిర్వహించబోతోంది.అలాగే బూత్ కమిటీ నియామకం పైన పూర్తిగా ఫోకస్ పెట్టింది.

ఒక్కో బూత్ కమిటీలో 22 మంది సభ్యులు ఉండే విధంగా చూడాలని హై కమాండ్ షరతు విధించింది.ఇలా అన్ని విషయాల్లోనూ రాష్ట్ర నాయకులను అలెర్ట్ చేస్తూ, రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube