ఇప్పటి వరకు కరోనా అన్ని దేశాలను అతలాకుతలం చేసింది.ముఖ్యంగా వైద్య వసతులు అధికంగా ఉండే అగ్ర రాజ్యం అమెరికాలో కూడా లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.
తాజాగా మరో వ్యాధి వారిని భయ పెడుతోంది.ప్రజలు సినిమాలలో చూపించినట్లు జాంబీలుగా మారిపోతున్నారు.
వారి చర్మం ముడతలు పడి భయంకరంగా తయారవుతోంది.దీనికి గ్జైలాజైన్(Xylazine) అనే డ్రగ్ కారణమని అధికారుల పరిశోధనలలో తేలింది.
దీనికి ట్రాంక్ డోప్(tranq dope), ట్రాంక్(tranq), జాంబీ డ్రగ్(zombie Drug) అనే పేర్లు కూడా ఉన్నాయి.ఈ డ్రగ్‌ను వాడడం వల్లే ప్రజలకు ఇటువంటి పరిస్థితి తలెత్తిందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ఈ డ్రగ్ వాడడం వల్ల ప్రజలు వింత అనారోగ్యానికి గురవుతున్నారని తేలింది.అమెరికాలోని అనేక నగరాల్లో, ప్రజలు స్కిన్ రాట్ సహా ప్రాణాంతక వ్యాధి లక్షణాలను చూస్తున్నారు.ఈ వ్యాధిని కొందరు ‘జాంబీస్’తో పోల్చారు.ఈ గ్జైలాజైన్ డ్రగ్‌ను పశువుల కోసం తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.పశు వైద్య ప్రయోజనం కోసం దేశంలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) దీనికి ఆమోదం తెలిపింది.అయితే ఇటీవల ఇది ఫెంటినిల్, ఇతర అక్రమ మందులలో కనుగొనబడింది.
ఇది మనుషులకు హానికరం.మానవులకు ఎంత మాత్రం సురక్షితం కాదు.
దీనిని వాడిన వారికి అధిక నిద్ర, శ్వాసకోశ వ్యాధులు తలెత్తుతున్నాయి.

ఇవి ఇతరులకు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి.సమయానికి చికిత్స చేయకపోతే అప్పుడు చర్మం కుళ్ళిపోవటం ప్రారంభిస్తుంది.ఈ పరిస్థితిలో వ్యాధి సోకిన శరీర భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది.
ఈ డ్రగ్‌ను ఇతర అక్రమ పదార్ధాలతో కలిపినప్పుడు అధిక మోతాదు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.మాదక ద్రవ్యాలలో దీనిని అధికంగా వినియోస్తుండడంతో దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి.







