టీడీపీకి ఇంటింటి ప్రచారం కలిసొస్తుందా ?

ప్రస్తుతం ఏపీలో టీడీపీ( TDP ) పరిస్థితి ఎంతటి అస్తవ్యస్తంగా మారిందో అందరికీ తెలిసిందే.సరిగ్గా ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) జైలుపాలు కావడంతో ఒక్కసారిగా టీడీపీ దూకుడుకు స్పీడ్ బ్రేకులు పడ్డాయి.

 Will The Intinti Pracharam Campaign Work For Tdp?,ap Politics, Gadapa Gadapaku M-TeluguStop.com

అంతకుముందు ఆయా కార్యక్రమాలతో ప్రజల్లో యాక్టివ్ గా ఉన్న టీడీపీ.చంద్రబాబు అరెస్ట్ తరువాత సైలెంట్ అయింది.

కాగా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఆయన ఎప్పుడు బయటకు వస్తారో కూడా చెప్పలేని పరిస్థితి.దీంతో పార్టీ ఇలాగే నెమ్మదిస్తే ప్రజల్లో పార్టీపై మద్దతు కోల్పోయే ప్రమాదం ఉంది.

Telugu Ap, Chandrababu, Gadapagadapaku, Janasena, Pawan Kalyan, Tdp, Ys Jagan-Po

అందుకే ఇకపై పూర్తిగా ప్రజల్లో ఉండేందుకు టీడీపీ ప్రణాళికలు రచిస్తోంది.ప్రస్తుతం ఆ పార్టీ జనసేనతో పొత్తు( Janasena TDP Alliance )లో ఉన్న సంగతి తెలిసిందే.ఇకపై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిన ఇరు పార్టీలు కలిసే నిర్వహించాలని డిసైడ్ అయ్యారు పార్టీ అధినాయకులు.ఇకపోతే నవంబర్ 1 నుంచి ఇంటింటి ప్రచారం చేపట్టాలని టీడీపీ భావిస్తోంది.

ఇంటింటి ప్రచారంలో బాబు అక్రమ అరెస్ట్ గురించి ప్రజలకు వివరించి సానుభూతి పొందాలని టీడీపీ ప్రణాళిక వేసింది.అయితే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఆల్రెడీ ఇప్పటికే వైసీపీ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది.

Telugu Ap, Chandrababu, Gadapagadapaku, Janasena, Pawan Kalyan, Tdp, Ys Jagan-Po

అయితే ఈ గడప గడపకు మన ప్రభుత్వం( Gadapa Gadapaku Mana Prabhutvam ) కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజలు వ్యతిరేకత చూపిన సందర్భాలు చాలా ఉన్నాయి.మరి ఇప్పుడు ఇంటింటి ప్రచారం పేరుతో టీడీపీ జనంలోకి వెళితే.ఈ ప్రచారంపై ప్రజల్లో స్పందన ఎలా ఉంటుదనేది ఆసక్తికరంగా మారింది.గత ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతిని ప్రజలు ప్రశ్నిస్తారా ? లేదా చంద్రబాబు అక్రమ అరెస్ట్( Chandrababu Arrest ) పై ప్రజలు సానుభూతిగా వ్యవహరిస్తారా అనేది చూడాలి.అలాగే నారా భువనేశ్వరి తో కూడా యాత్ర చేయించేందుకు టీడీపీ వ్యూహరచన చేస్తున్న సంగతి తెలిసిందే.మరి బాబు అరెస్ట్ నే ప్రధాన ఎజెండాగా నిర్వహిస్తున్న టీడీపీ ప్రచార కార్యక్రమాలు ఎంతవరకు సక్సస్ అవుతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube