చంద్రబాబు వ్యూహాస్త్రం.. ఫలిస్తుందా ?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) నిన్న మొన్నటి వరకు యమదూకుడుగా కనిపించారు.వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని అధికారంలోకి తీసుకురావలనే ఉద్దేశ్యంతో పర్యటనలు, రోడ్ షో లు నిర్వహిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తూ వచ్చారు.అయితే చంద్రబాబు ఊహించని విధంగా రూ.118 కోట్ల అవినీతి వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంది.దీంతో ఒక్కసారిగా బాబు దూకుడుకి స్పీడ్ బ్రేక్ పడినట్లైంది.అమరావతి రాజధాని( Amaravati ) నిర్మాణంలో రూ.118 కోట్ల ముడుపులు బాబుకు అందాయని స్వయంగా ఐటీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 Will Chandrababu's Strategy Work, Amaravati , Chandrababu Naidu, Tdp , Ycp, Ap P-TeluguStop.com
Telugu Amaravati, Ap, Chandrababu, Roja, Ys Jagan-Politics

అయితే ఈ నోటీసులపై అటు టీడీపీ నేతలుగాని, ఇటు చంద్రబాబు గాని పెద్దగా స్పందించడం లేదు.ఈ నోటీసులు చట్టపరంగా లేవని చంద్రబాబు ఐటీకి లేఖ రాసినప్పటికి పెద్దగా ఫలితం లేకపోయింది.దీంతో రూ.118 కోట్ల వ్యవహారం చంద్రబాబుకు మింగుడు పడడం లేదట.దీనిపై ఎలా క్లారిటీ ఇవ్వాలో అర్థంకానీ సంధిగ్డంలో ఆయన ఉన్నట్లు వినికిడి.

కాగా చంద్రబాబు అత్యంత అవినీతిపరుడని త్వరలో ఆయన అరెస్ట్ కావడం గ్యారెంటీ అని చెబుతున్నారు వైసీపీ నేతలు.దీంతో ఈ కేసు నుంచి చంద్రబాబు ఎలా బయట పడతారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Telugu Amaravati, Ap, Chandrababu, Roja, Ys Jagan-Politics

అయితే దీనిపై ఇంతవరకు పెద్దగా స్పందించని బాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం పోలిటికల్ హిట్ పెంచుతున్నాయి.తాను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని వైసీపీ నేతలు తప్పుడు కేసులు పెడుతున్నారని రేపో, ఎల్లుండో తనను అరెస్ట్ చేయవచ్చేమో అని స్వయంగా చంద్రబాబే చెప్పడం గమనార్హం.దీంతో అరెస్ట్ ను చంద్రబాబు ముందుగానే ఊహిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.అందుకే అరెస్ట్ అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటూ తన అరెస్ట్ కు కారణం వైసీపీనే అనే భావనా ప్రజల్లో కలిగేలా చేస్తున్నారని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే రాజధాని నిర్మాణంలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహ ఐటీ బయటపెట్టడంతో బాబు ఎన్ని వ్యూహాలు పన్నినా అవన్నీ వ్యర్థమే అనేది మరికొందరి అభిప్రాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube