ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) అనేది విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది.ఛాట్ జీపీటీ( ChatGPT ) రాకతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి బాగా చర్చ జరుగుతుంది.
ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగానే రోబోలను( Robots ) తయారుచేస్తూ ఉంటారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ప్రోగ్రామింగ్ ద్వారా రోబోలను రూపొందిస్తున్నారు.
అయితే అమ్మాయిల పోలికలతోనే రోబోలన్నీ ఉంటాయి.రోబోలు అమ్మాయిల పోలికతో ఉండటానికి ఒక కారణం ఉందట.
అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటికే అనేక రోబోలను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
వీటిని వివిధ పనుల కోసం ఉపయోగిస్తున్నారు.ఈ రోబలన్నీ అమ్మాయిల పోలికతోనే తయారుచేసినవే.
సోఫియా, నాడిన్, మికా, డెస్డెమోనా అనే పేర్లను రోబోలకు పెట్టారు.అమ్మాయిల పేర్లతో పాటు అమ్మాయిలను పోలిన డిజైన్ తో రోబోలను( Female Robots ) తయారుచేయడానికి లింగ వివక్షనే కారణమనే వాదనలు ఉణ్నాయి.
డిజైనర్లు ఎక్కువగా తమను పోలిన లేదా తమకు నచ్చిన రోబోలను తయారుచేయడానికి ఇష్టపడతారని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటివరకు రోబోలను రూపొందించినవారిలో ఎక్కువమంది మహిళలే ఉన్నారు.దీని వల్ల సహజంగా స్త్రీ రూపం ఇచ్చి ఉంటారని అంటున్నారు.స్త్రీ ఆకారాన్ని పోలిన రోబోల తయారీపైనే సంస్థలు, నిపుణులు ఆసక్తి చూపుతున్నాయని అంటున్నారు.
జెమినాయడ్( Geminoid ) అనే మగ రోబోను హిరోషి ఇషిగురో అనే వ్యక్తి తయారుచేశాడు.అతడు మాట్లాడుతూ.టెక్నాలజీ ప్రపంచంలో లింగ వివక్షకు తావులేదని, ప్రపంచ మార్కెట్,
ఇంట్రెస్ట్ ని బట్టి ఆడ రోబోలను తయారుచేయడానికి, రోబోలకు ఉమెన్ వాయిస్ ని ఇవ్వడానికే డిజైన్ చేసేవారు ఆసక్తి కనబరుస్తున్నట్లు చెబుతున్నారు.ఇక మరికొంతమంది మాట్లాడుతూ.స్త్రీని ఒక మార్కెట్ వస్తువుగా, లైంగిక వస్తువుగా చూసే ధోరణీ పెరుగుతుందని, అందుకే స్త్రీ రోబోలను తయారుచేస్తున్నారని స్త్రీ వాదులు ఆరోపిస్తున్నారు.ఎక్కువమంది స్త్రీలను చూసేందుకు ఇష్టపడతారని, అందుకే స్త్రీ రోబోలకే కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయని వాదిస్తున్నారు.