చిరంజీవి పక్కన సినిమాలో నటించే అవకాశం ఈ నటి ఎలా కోల్పోయిందో తెలుసా ?

నీడ లేని ఏడాది అనే సినిమాలో కేవలం 15 ఏళ్ళ వయసులో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన నటి ప్రభ. 1947 వ సంవత్సరం లో విడుదల అయినా ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ప్రభ హీరోయిన్ గా ఇండస్ట్రీ లో సెటిల్ అయ్యింది.

 Why Prabha Felt Bad About Chiranjeevi Khaidi Movie Details, Chiranjeevi, Khaidi-TeluguStop.com

ఇక ఇప్పటికే కెరీర్ మొదలు పెట్టి ఐదు దశాబ్దాలకు చేరువ అవుతున్న ప్రభ నటిగానే కాకుండా కూచిపూడి డ్యాన్సర్ గా కూడా స్టేజి ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.సౌత్ ఇండియా లోని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేకం సినిమాల్లో నటించి అప్పటి అగ్ర హీరోలందరితో నటించింది.

ఎన్టీఆర్ వంటి హీరో తో దానవీర శూర కర్ణ సినిమాలో నటించిన ప్రభ, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు వంటి వారితో మాత్రమే కాకుండా ఆ తర్వాత జెనరేషన్ హీరోలయిన చిరంజీవి, మోహన్ బాబు లతో కూడా నటించిన రికార్డు ఆమెకు మాత్రమే సొంతం.చిత్రం భళారే విచిత్రం సినిమా ఆమె సినిమా కెరీర్ లో గొప్ప చిత్రం గా నిలిచింది.

శ్రీదేవి, జయసుధ, రాధికా, జయప్రద ఆమెకు సమకాలీకులుగా ఉన్నారు.అయితే ఆమె మరి కొంత కాలం స్టార్ హీరోయిన్ గా ఉండే అవకాశం ఆమెకు తెలియకుండానే పోగొట్టుకున్నది.

చిరంజీవి ఖైదీ సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంజనం గురించి అందరికి తెలిసిందే.

ఖైదీ సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తే, మాధవి, సుమలత హీరోయిన్ లుగా నటించారు.

Telugu Actress Prabha, Chiranjeevi, Sujatha Role, Madhavi, Prabha, Sumalatha, Kh

అయితే మొదట డాక్టర్ సుజాత పాత్ర కోసం ప్రభ ను సంప్రదించారట సినిమా దర్శకుడు.కానీ కథ చెప్పిన సమయంలో సుజాత పాత్ర కేవలం ఒక్క రోజు షూటింగ్ మాత్రమే అని, అంతగా ప్రాముఖ్యత లేని పాత్ర అని చెప్పడం తో ప్రభ అందుకు ఒప్పుకోలేదట.అప్పటికే ప్రభ కెరీర్ ఫుల్ పీక్ లో ఉండటం తో ఆమె నో చెప్పింది దాంతో ఆ పాత్ర కోసం సుమలతను తీసుకున్నారట.కానీ సినిమా రిలీజ్ అయ్యాక అది హీరోయిన్ కన్నా కూడా మంచి పేరు తెచ్చుకున్న పాత్ర కావడంతో అందులో నటించందుకు ఆమె ఎంతోగానో బాధ పడిందట.

ఆ రోజు చిరంజీవి పక్కన ఆ పాత్ర చేసి ఉంటె మరి కొంత కాలం ఆమె కెరీర్ బాగుండేది అని ప్రభ ఫీల్ అయ్యారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube