లేడీ డిటెక్టివ్. ఒకప్పుడు తెలుగు నాట బాగా పాపులర్ సీరియల్.
ఇందులో కీలక పాత్ర పోషించింది కర్నాటక అమ్మాయి ఉత్తర. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి.
ఆ సమస్యలను పరిష్కరించేది ఉత్తర.ఆమె ఈ సీరియల్ లో డిటెక్టివ్ పాత్ర పోషించింది.
అప్పట్లో ఈ సీరియల్ ను ఇష్టపడి జనం ఉండేవారు కాదంటే ఆశ్చర్యం కలగకమానదు.ఇప్పటికీ ఉత్తర అనగానే ఆమె నటించిన లేడీ డిటెక్టివ్ సీరియల్ గుర్తొస్తుంది.
ఈ అమ్మడు అంతకు ముందే రంభ ఊర్వశి మేనక అనే సినిమాలో నటించింది.ఆ తర్వాత తమిళంలో వైదేహి కల్యాణం అనే సినిమా కూడా చేసింది.
ఇందులో శర్త్ కుమార్ బిడ్డ పాత్ర పోషించింది.ఆ తర్వత శ్రీకాంత్, జేడీ చక్రవర్తి నటించిన వన్ బై టు సినిమాలో నటించింది.
అదే సమయంలో అంటే 1995లో రామోజీ రావు ఈటీవీని ప్రారంభించాడు.అప్పుడే జంధ్యాల దర్శకత్వంలో అబద్దాల పెళ్లిళ్లు అనే సీరియల్ తెరకెక్కింది.ఇందులో ఉత్తర నటించింది.ఆమెతో పాటు చిన్నా, శివాజీ రాజా కూడా యాక్ట్ చేశారు.
దీని తర్వాత సుమన్ దర్శకత్వంలో వసుంధర అనే సీరియల్ వచ్చేది.ఇందులో కూడా ఉత్తర నటించి మెప్పించింది.
తను ఎక్కడ ఏపాత్ర చేసినా అద్భుతంగా నటించేది.
అప్పటికే ఈటీవీకి సంబంధించిన పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది ఉత్తర.చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది.ఈటీవీ ఫస్ట్ యానివర్సరీ నిర్వహించారు.
ఆ సందర్భంగానే లేడీ డిటెక్టివ్ అనే సీరియల్ మొదలయ్యింది.ఇందులో మెయిన్ రోల్ పోషించింది ఉత్తర.
ఈ సీరియల్ టైటిల్ సాంగ్ కూడా జనాల్లో బాగా వెళ్లింది.ఈ సీరియల్ మొదలయ్యిందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోయేవారు.
ఇందులో శోధన అనే పాత్ర పోషించింది ఉత్తర.ఈమెకు సహాయకులుగా సాక్షి రంగారావు, రమాప్రభ నటించారు.ఈ సీరియల్ బాగా జనాదరణ దక్కించుకుంది.దీంతో ఉత్తరకు కోరుకున్న ప్రియుడు అనే సినిమాలో అవకాశం వచ్చింది.ఆ తర్వాత లైఫ్ లో వైఫ్ అనే సినిమా కూడా చేసింది.దశాబ్దం పాటు సినిమాలు, సీరియల్స్ చేసిన ఉత్తర.
ఆ తర్వాత నటనకు దూరం అయ్యింది.ప్రస్తుతం ఆమె ఎక్కడుందో చాలా మందికి తెలియదు.