యుద్ధం వేళ అయోడిన్‌ టాబ్లెట్లకు బాగా పెరిగిన డిమాండ్.. ఎందుకో తెలిస్తే?

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో అణు దాడులు జరిగే అవకాశం ఉందన్న వేళ ఐరోపాలో అయోడిన్‌ మాత్రలు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి.యూరప్‌లోని కొన్ని దేశాలు అయోడిన్‌ టాబ్లెట్లను పెద్ద ఎత్తున స్టోర్ కూడా చేసుకుంటున్నాయి.

 Why Fears Of Nuclear War Has Increased The Demand For Iodine Tablets,iodine Tabl-TeluguStop.com

అయితే అణు దాడులకు, అయోడిన్ మాత్రలకు మధ్య లింక్ ఏంటి? అనే కదా మీ సందేహం.అయితే చాలా తక్కువమందికి తెలిసిన ఈ విశేషాలు మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిందే.

ఏ టాబ్లెట్లకు లేని ఓ ప్రత్యేక సామర్థ్యం అయోడిన్‌ మాత్రలకు ఉంది.అదేంటంటే ఈ టాబ్లెట్లు ఒకరకమైన రేడియేషన్‌ నుంచి మానవుల శరీరాన్ని రక్షిస్తాయి.న్యూక్లియర్ అటాక్ లేదా అణు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఒక్కోసారి రేడియోధార్మిక అయోడిన్‌ పరిసరాలలోకి రిలీజ్ అవుతుంది.అది మానవుల బాడీలోకి ప్రవేశిస్తే వారికి థైరాయిడ్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం రెట్టింపవుతుంది.

ప్రధానంగా చిన్నపిల్లలకు ఈ రేడియోధార్మిక అయోడిన్‌ ఎక్కువ హాని చేస్తుంది.రేడియోధార్మిక అయోడిన్‌ సంవత్సరాల కొద్దీ శరీరంపై చెడు ప్రభావం చూపించగలదు.

అందుకే దీని నుంచి రక్షించుకోవడం చాలా అవసరం.ఈ రక్షణ విషయంలో అయోడిన్ మాత్రలు సమర్థవంతంగా పని చేస్తాయి.

Telugu Tablets, Iodine Tablets, Nuclear, Russia, Ukraine-Latest News - Telugu

అయోడిన్‌ టాబ్లెట్లలో పొటాషియం అయోడైడ్‌ అని పిలిచే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది.వీటిని తీసుకుంటే మెడలో ఉండే థైరాయిడ్‌ గ్రంథి.స్థిరమైన అయోడిన్‌ లేదా పొటాషియం అయోడైడ్‌తో నిండిపోతుంది.అప్పుడు ఆ గ్రంథిలోకి రేడియోధార్మిక అయోడిన్‌ వెళ్లడానికి ఎలాంటి ప్లేస్ దొరకదు.ఆ విధంగా థైరాయిడ్‌ గ్రంథిలోకి రేడియోధార్మిక అయోడిన్‌ వెళ్లకుండా నిరోధించవచ్చు.అందుకే అయోడిన్ టాబ్లెట్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు.

కాగా ఇక్కడ ముఖ్యంగా పాటించాల్సిందే ఏంటంటే, రేడియేషన్‌ బారిన పడటానికి కొంతసేపు ముందే ఈ మాత్రలను తీసుకుంటే మంచి ప్రయోజనం దక్కుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube