విశాఖను పరిపాలన రాజధానిగా చేసి తీరుతాం మంత్రి బొత్స

జనసేన, టీడీపీలపై బొత్స విమర్శలు గుప్పించారు.విశాఖకు పరిపాలనా రాజధాని వస్తుంటే… టీడీపీ, జనసేన అడ్డుకుంటున్నాయని బొత్స ఆరోపించారు.3 రాజధానుల అంశంపై ఆ రెండు పార్టీలకు ఉన్న అభ్యంతరం ఏమిటని బొత్స ప్రశ్నించారు.విశాఖకు పరిపాలనా రాజధాని రాకుండా ఆ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.

 Minister Botsa Will Make Visakhapatnam The Administrative Capital-TeluguStop.com

విశాఖకు వ్యతిరేకంగా ఆ రెండు పార్టీలు ఆడే ఆటలు ఇకపై చెల్లబోవని కూడా బొత్స అన్నారు.జనసేన అసలు ఓ రాజకీయ పార్టీనే కాదన్న బొత్స… ఓ వ్యక్తి పెట్టుకున్న సంస్థగా అభివర్ణించారు.

జనసేనతో పాటు టీడీపీకి విశాఖపై అంత కక్ష ఎందుకని బొత్స ప్రశ్నించారు.విశాఖకు పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుందని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ విషయంపై విస్పష్ట ప్రకటన చేశారు.ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని కూడా ఆయన పేర్కొన్నారు.

విశాఖకు పరిపాలనా రాజధాని రావాలన్న కాంక్ష ఉత్తరాంధ్ర ప్రజల్లో బలంగా ఉందని కూడా ఆయన చెప్పారు.ఈ విషయం శనివారం నాటి విశాఖ గర్జనలో స్పష్టమైందని బొత్స తెలిపారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube