గెట్ రెడీ.. 'NBK107' టైటిల్ అనౌన్స్ డేట్ లాక్.. సంతోషంలో నందమూరి ఫ్యాన్స్!

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా NBK107.బాలకృష్ణ అఖండ సినిమాతో అఖండమైన విజయం అందుకున్నాడు.ఈ విజయాన్ని కొనసాగించాలని తహతహ లాడుతున్నాడు.అందుకే మాంచి మాస్ డైరెక్టర్ ను లైన్లో పెట్టాడు.

 Nbk107 Movie Title Announce Date Fixed-TeluguStop.com

గోపిచంద్ మలినేని కూడా క్రాక్ వంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత బాలయ్యతో సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై నందమూరి ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి బాలయ్య లుక్ రివీల్ అయ్యింది.

ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమా ప్రకటించి సగానికి పైగానే షూటింగ్ కూడా పూర్తి చేసిన ఇంకా టైటిల్ మాత్రం రివీల్ చెయ్యలేదు.

దీంతో ఈ సినిమా టైటిల్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Telugu Balakrishna Nbk, Nandamuri Fans, Nbk, Shruti Haasan-Movie

ఈ క్రమంలోనే మేకర్స్ ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తున్నట్టు అధికారికంగా తెలిపారు.అందుకు డేట్ కూడా ఫిక్స్ చేసారు.

ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయడానికి అక్టోబర్ 21న డేట్ ఫిక్స్ చేసారు.

ఆ రోజు అధికారికంగా ప్రకటిస్తాం అని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube