తెలంగాణ ఎన్నికల్లో( Telangana Elections ) సత్తా చాటుతుందని భావించిన బీజేపీ.( BJP ) ఎవరు ఊహించని రీతిలో ఎనిమిది సీట్లకే పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది.
జాతీయ నేతలు సైతం ప్రచారం చేసినప్పటికీ పెద్దగా బీజేపీకి కలిసొచ్చిందేమీ లేదు.పార్టీ ఈ స్థాయిలో ఓటమి చవిచూడడానికి ప్రధాన కారణం ఆ పార్టీలోని అంతర్గత సమస్యలే అనేది ఒక కారణమైతే.
ఆ పార్టీ విధానాలు కూడా మరో కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ముఖ్యంగా హిందుత్వ ఎజెండాతో నడిచే బీజేపీ.
ఇతర మతాల పట్ల చూపించే వైఖరి కూడా ఆ పార్టీ ఓటమికి ఓ కారణమని విశ్లేషకుల అభిప్రాయం.ముస్లిం వర్గాల వారిని కించపరిచేలా మాట్లాడడం, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం వంటి కారణాలు బీజేపీని తెలంగాణ ప్రజలు దూరం పెట్టెలా చేశాయని కొందరు చెప్పే మాట.

అయితే ఎన్నికలు పూర్తయినప్పటికి మతతత్వ రాజకీయాలు( Religious Politics ) చేయడం మాత్రం బీజేపీ ఇంకా మానుకోలేదని తాజా పరిణామాలను చూస్తే ఇట్టే అర్థమౌతుంది.ప్రోటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీ( Akbaruddin Owaisi ) ఎన్నికవ్వడంతో బీజేపీ ఎమ్మేల్యేలు ఎవరు ఇవాళ ప్రమాణస్వీకరానికి హాజరు కాకపోవడం గమనార్హం.ఎందుకంటే అక్బరుద్దీన్ ఒవైసీ ముస్లిం అయినందున ఆయన ఎదురుగా ప్రమాణస్వీకారం చేయడానికి ఆసక్తి చూపడం లేదని అందుకే బీజేపీలోని ఎనిమిది మంది ఎమ్మేల్యేలు ప్రమాణస్వీకారానికి రాలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అయితే కమలనాథులు చెబుతున్నది మాత్రం ఇంకోలాఉంది. ఏంఐఏం కాంగ్రెస్ మద్య లోపాయికారి ఒప్పందం ఉందని అందుకే ప్రోటెం స్పీకర్ గా( Protem Speaker ) ఒవైసీని కాంగ్రెస్ ఎంపిక చేసిందని కమలనాథులు చెబుతున్నారు.రెగ్యులర్ స్పీకర్ వచ్చాకే ప్రమాణ స్వీకారం చేసేందుకు మొగ్గు చూపుతామని బీజేపీ ఎమ్మేల్యేలు చెబుతున్నారు.
అయితే అసెంబ్లీలో కూడా ఇలా మతతత్వ రాజకీయాలు చేయడంతో బీజేపీపై విమర్శలు గట్టిగానే వ్యతమౌతున్నాయి.ఇప్పటికైనా కమలం పార్టీ మతతత్వ రాజకీయాలకు గుడ్ బై చెప్పకపోతే.రాష్ట్రంలో మరింతగా పతనమౌతుందని కొందరు రాజకీయ అతివాదులు హెచ్చరిస్తున్నారు.