ఎవరు సి‌ఎం.. కాంగ్రెస్ కు పెద్ద టాస్క్ ఇదే !

కర్నాటక ఎన్నికల్లో( Karnataka Elections ) ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.( Congress Party ) ప్రస్తుతం సి‌ఎం అభ్యర్థి ఎన్నికలో తలమునకలైంది.135 స్థానాల్లో విజయ ఢంఖా మోగించి ఏ పార్టీ అండ లేకుండానే గ్రాండ్ గా ప్రభుత్వాన్ని స్థాపించబోతున్న హస్తం పార్టీకి సి‌ఎం ను ఎన్నుకోవడం ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారింది.ఒకవైపు మాజీ సి‌ఎం సిద్దిరామయ్య మరోవైపు కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్( DK Shivakumar ) సి‌ఎం రేస్ లో ఉన్నారు.

 Who Is The Cm Of Karnataka Details, Karnataka Elections, Karnataka Cm,congress P-TeluguStop.com

ఇద్దరు బలమైన నాయకులు కావడంతో ఎవరిని ఎన్నుకోవాలనేది కాంగ్రెస్ అధిష్టానానికి చిక్కుముడిగా మారింది.అయితే నేడు జరిగే సిఎల్పీ సమావేశంలో సి‌ఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

అయితే సర్వేలు చెబుతున్నా దాని ప్రకారం కాంగ్రెస్ తరుపున సిద్దిరామయ్యనే సి‌ఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

Telugu Congress, Dk Sivakumar, Karnataka Cm, Karnataka, Rahul Gandhi, Siddharama

41 శాతం ప్రజలు సిద్దిరామయ్య( Siddharamaiah ) వైపే మొగ్గు చూపారట.అదే సమయంలో డీకే శివకుమార్ ను సి‌ఎం ఛాయిస్ గా 4 శాతం ప్రజలు మాత్రమే ఎన్నుకొన్నారు.దీంతో కాంగ్రెస్ అధిష్టానం సిద్దిరామయ్య వైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉందంటూ పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సిద్దిరామయ్య 2013 నుంచి 2018 వరకు కర్నాటక సి‌ఎం గా కొనసాగారు.ఆ రాష్ట్రంలో అయిదెండ్లు సి‌ఎం పదవిలో కొనసాగిన నేతగా సిద్దిరామయ్యకు గుర్తింపు ఉంది.అంతే కాకుండా ఆయన సి‌ఎం పదవిలో ఉన్నప్పుడూ రాష్ట్రంలో చేపట్టిన ఎన్నో విధానాలు, పథకాలు ప్రజామెప్పు పొందాయి.

Telugu Congress, Dk Sivakumar, Karnataka Cm, Karnataka, Rahul Gandhi, Siddharama

అందువల్లే ప్రజలు సిద్దిరామయ్యకే సి‌ఎం ఛాయిస్ గా ఎక్కువ ప్రదాన్యం ఇస్తున్నారు.ఇక మరోవైపు డీకే శివకుమార్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత.కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది.2018 తరువాత బిజెపి తాకిడిని తట్టుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పెంచుకోవడానికి డీకే శివకుమార్ నాయకత్వమే కారణం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా మాట.అందువల్ల ఈసారి సి‌ఎంగా డీకే శివకుమార్ కు అధిష్టానం ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదు.అదే జరిగితే సిద్దిరామయ్య పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తారా ? అలా చేయడం వల్ల హస్తం పార్టీలో అతర్మథనం మొదలయ్యే అవకాశం అవకాశం ఉంది.ఒకవేళ సిద్దిరామయ్యకు సి‌ఎం పదవి కట్టబెడితే డీకే శివకమర్ ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా ఆసక్తికర అంశమే.

మొత్తానికి ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన సి‌ఎంను ఎన్నుకోవడంలో మాత్రం హస్తం పార్టీకి పెద్ద చిక్కే వచ్చిపడింది.మరి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube