టి కాంగ్రెస్( Telangana Congress ) ఎన్నికల వేళ ఎంత దూకుడుగా ఉన్నప్పటికి ఆ పార్టీని ప్రధానంగా వేధిస్తున్న సమస్య సిఎం అభ్యర్థి ఎవరనే అంశం.ఓ వైపు ఎన్నికలకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది.
ఇప్పటికే రెండు జాబితాల్లో 100 మంది అభ్యర్థులను కూడా ప్రకటించింది హస్తం పార్టీ.మిగిలిన 19 స్థానాలకు కూడా అభ్యర్థులను రేపో మాపో ప్రకటించే అవకాశం ఉంది.
ఇక మిగిలింది ప్రచార పర్వమే.ప్రచారంలోకి బలంగా వెళ్లాలంటే సిఎం అభ్యర్థి ప్రస్తావన రాకమానదు.
ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సిఎం అభ్యర్థి విషయంలో దాదాపు అరడజన్ మంది రేస్ లో ఉన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth reddy )తో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, జగ్గారెడ్డి.వంటి వారు ఇప్పటికే సీఎం పదవి విషయంలో అడపా దడపా నోరు మెదుపుతూనే ఉన్నారు.ఇదిలా ఉంచితే ఇటీవల సిఎం అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ నేత రామ్మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
రేవంత్ రెడ్డి సిఎం అభ్యర్థిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.ప్రస్తుతం రామ్మోహన్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో అగ్గి రాజేస్తున్నాయి.ఈ విషయంపై కోమటిరెడ్డి వెంటకారెడ్డి స్పందిస్తూ.రామ్మోహన్( Rammohan ) వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, డికె శివకుమార్ ( DK Shivakumar )కూడా ఇతర వ్యాఖ్యలు చేసిన పరిగణలోకి తీసుకోబోమని, అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అవుతుందని వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు.

దీంతో ఒకవేళ సిఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ప్రకటిస్తే పార్టీలో చీలిక తప్పదనే హెచ్చరికలు గట్టిగానే కనిపిస్తున్నాయి.పార్టీలోని సీనియర్ నేతలంతా కూడా సిఎం పదవే టార్గెట్ గా ఉండడంతో ఎన్నికల ముందు సిఎం అభ్యర్థిని ప్రకటిస్తే.పార్టీ నష్టం చేకూరే అవకాశాలు చాలా ఎక్కువ.అందుకే ఈ విషయంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది.అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తరువాత సిఎం అభ్యర్థి విషయంలో ఎంపిక చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మొత్తానికి హస్తం పార్టీకి సిఎం అభ్యర్థి అంశం తీవ్ర తలనొప్పిగా మారిందనే చెప్పాలి.