కొందరు వాళ్ళకి నచ్చిన పని చేయడానికి ఎంత రిస్క్ అయిన సరే చేస్తూ ఉంటారు అంత డెడికేషన్ ఉంటేనే వాళ్ళు చేసే పనిలో సక్సెస్ సాధిస్తారు.ఇక సినిమా హీరోలు అంటే కొంచం రిస్కీ షాట్స్ ఉన్నాయి అంటే చాలు వాళ్ళకి డూప్ లుగా ఉన్న వాళ్ళ చేత యాక్ట్ చేపిస్తారు అని అందరూ అనుకుంటారు.
కానీ కొందరు హీరోలు మాత్రం ఎంత పెద్ద రిస్కీ షాట్ అయిన సరే డూప్ సహాయం లేకుండా వాళ్లే నటిస్తారు అలాంటి కేటగిరీకి చెందినవాడే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్.అసలు విషయం లోకి వెళ్తే వి వి వినాయక్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా చేసిన ఆది సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో ఎన్టీఆర్ క్లైమాక్స్ ఫైట్ షూట్ చేసే సమయం లో ఆయన చేతికి పెద్ద గాయం అయింది.అది చూసిన ఆ మూవీ టీమ్ ఆయన్ని రెస్ట్ తీసుకోండి రెండు రోజుల తరువాత షూట్ పెట్టుకుందాం అని అంటే అప్పుడు ఎన్టీఆర్ నా వల్ల ప్రొడ్యూసర్ కి లాస్ అవ్వకూడదు ప్రొడ్యూసర్ బాగుంటేనే మనం బాగుంటాం అనే ఒకే ఒక మాట కి కట్టుబడి సరే షూట్ చెద్దాం అని చెప్పి ఆ విరిగిన చేయి తోనే యాక్టింగ్ చేసాడు.
ఒక పక్క చేయి విరిగి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా ఫైట్ సీన్ చేసాడు అంతటి డెడికేషన్ ఉంది కాబట్టే ఇప్పటికీ ఎన్టీఆర్ఇండస్ట్రీ లో ఒక టాప్ హీరోగా కొనసాగుతున్నారు.అలా ఒక నటుడికి తను చేసే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి దానికోసం ఏది చేయడానికైనా సరే రెడీ గా ఉన్నప్పుడే వాళ్లు లైఫ్ లో చాలా ఉన్నతమైన స్థాయి కి వెళ్తారు అని చెప్పడానికి ఎన్టీఆర్ ని ఒక ఉదాహరణగా చూపించవచ్చు…
.