జాతీయ చలన చిత్ర దినోత్సవం సందడి ఎక్కడ కనిపించదేం?

ఇండియన్స్ కి సినిమా( Movie ) అంటే పిచ్చి.ముఖ్యంగా సౌత్‌ వారికి పిచ్చి అనే పదం కంటే కూడా ఇంకా ఎక్కువ ప్రేమ అని చెప్పడానికి ఏమైనా పదం ఉంటే దాన్ని ఉపయోగించాల్సిందే.

 Where Will The National Cinema Day Buzz Be Felt Details, National Cinema Day, To-TeluguStop.com

సౌత్ ఇండియన్స్ సినిమా ను ఎంతగా ఇష్టపడుతారో.వారు తమ అభిమానల హీరోల గురించి సోషల్‌ మీడియా లో మాట్లాడుకునే మాటలు, చేసుకునే యుద్దాలను చూస్తే అర్థం అవుతుంది.

సినిమా అనేది లక్షలాది మందికి ఉపాదిని కల్పిస్తూ ఉంటే కోట్లాది మందికి వినోదాన్ని అందిస్తూ ఉంటుంది.సినిమా అనేది ఒక పరిశ్రమ అన్నట్లుగా కాకుండా ఒక ఫ్యామిలీ మాదిరిగా కలిసి ఉండాలని పెద్ద వారు అంటూ ఉండే వారు.

కానీ ఏ ఒక్కరు కూడా సినిమా ను ఫ్యామిలీ లా చూడటం లేదు.

Telugu Black, Bollywood, Heroes, Multiplex, National Day, Producers, Telugu, Tol

పై పెచ్చు ఈ మధ్య కాలం లో సినిమా అనేది ఒక వ్యాపారం ( Business ) అయింది.బాగా డబ్బు ఉన్న వారు బ్లాక్ మనీని( Black Money ) వైట్ మనీగా మార్చుకునేందుకు సినిమా ను ఉపయోగించుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఆ విషయం ను పక్కన పెడితే నేడు జాతీయ చలన చిత్ర దినోత్సవం.

( National Cinema Day ) ఈ సందర్భంగా డబ్బు వేటలో పడ్డ నిర్మాతలు ఏమైనా స్పందిస్తారా అంటే ఏ ఒక్కరు స్పందించలేదు.ఇక హీరో లు హీరోయిన్స్ ఇతర టెక్నీషియన్స్ సోషల్‌ మీడియా వాల్స్ కి వెళ్లి చూస్తే ఏమీ లేదు.

ఒక్కరు ఇద్దరు తప్ప ఏ ఒక్కరు కూడా నేడు ప్రత్యేకమైన రోజుగా గుర్తించడం లేదు.ఇండస్ట్రీలో ఇలాంటి ఒక రోజును పండుగ మాదిరిగా చేసుకుంటే బాగుంటుంది.

Telugu Black, Bollywood, Heroes, Multiplex, National Day, Producers, Telugu, Tol

కానీ ఎక్కడ కూడా ఆ సందడి కనిపించడం లేదు.అయితే జాతీయ చలన చిత్ర దినోత్సవం సందర్భంగా మల్టీ ప్లెక్స్ ల్లో( Multiplex ) 99 రూపాయలకే టికెట్ల ను ఇస్తున్నారు.ఈ ఒక్క రోజు లో ఏ మల్టీ ప్లెక్స్‌ లో అయినా రూ.99 లకే సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు.సాధారణ రోజుల్లో రూ.250 నుంచి రూ.1000 ల వరకు ఉండే టికెట్‌ ధర నేడు మాత్రం కేవలం రూ.99 మాత్రమే.జాతీయ చలన చిత్ర దినోత్సవం సందర్భంగా సామాన్య సినీ ప్రేమికులకు ఇదొక ఉపయోగంగా చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube