తెల్ల జుట్టుతో బాధ‌ప‌డుతున్నారా..వాముతో చెక్ పెట్టండిలా!

వ‌య‌సు పెరిగే కొద్ది జుట్టు తెల్ల‌బ‌డ‌టం స‌ర్వ సాధార‌ణ విష‌యం.కానీ, ఇటీవ‌ల కాలంలో చాలా మంది చిన్న వ‌య‌సులో తెల్ల జుట్టు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.

 Ajwain Helps To Reduce White Hair Problem! Ajwain, White Hair Problem, White Ha-TeluguStop.com

ఇందుకు చాలా కార‌ణాలు ఉన్నాయి.ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, కాలుష్యం, హైపర్ థైరాయిడిజం, స్మోకింగ్‌, మ‌ద్య‌పానం, పోష‌కాల లోపం, అధిక ఒత్తిడి, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల న‌ల్ల జుట్టు తెల్ల‌గా మారిపోతూ ఉంటుంది.

ఇక యంగ్ ఏజ్ లో జుట్టు తెల్ల బ‌డితే వారిలో ఏదో తెలియ‌ని ఆందోళ‌న మొద‌ల‌వుతుంది.మాన‌సికంగా కృంగిపోతుంటారు.

ఈ క్ర‌మంలోనే తెల్ల జుట్టును నివారించుకునేందుకు ర‌క‌ర‌కాల షాంపూలు, నూనెలు వాడుతుంటారు.కొంద‌రు జుట్టు రంగు వేయించుకుంటారు.అయితే స‌హ‌జంగానే తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు.ముఖ్యంగా తెల్ల జుట్టును నివారించ‌డంలో వాము అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

చూసేందుకు జీలకర్రలా ఉండే వాము రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది.

Telugu Ajwain, Benefits Ajwain, Carom Seeds, Care, Latest, Vaamu, White, White P

అలాగే వాము ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు మెండుగా ఉంటాయి.అయితే కేవ‌లం ఆరోగ్యానికి కాదు సౌంద‌ర్య ప‌రంగా కూడా వాము ఉప‌యోగ‌ప‌డుతుంది.ముఖ్యంగా తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ వాము, క‌రివేపాకు, ఎండు ద్రాక్ష వేసి బాగా మ‌రిగించండి.

ఆ త‌ర్వాత ఈ వాట‌ర్‌ను గోరువెచ్చ‌గా ఉన్న‌ప్పుడు సేవించండి.ఇలా చేస్తే క్ర‌మంగా మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది.

అలాగే వాము నుంచి తీసిన నూనెలో కొద్దిగా ఉసిరి కాయ పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, కుదుళ్ల‌కు మ‌రియు కేశాల‌కు ప‌ట్టించి ఒక గంట పాటు ఆర‌బెట్టుకోవాలి.

అనంత‌రం మామూలు షాంపూతో త‌ల‌స్నానం చేసేయాలి.ఇలా వారంలో ఒక‌టి లేదా రెండు సార్లు చేస్తే.

తెల్ల జుట్టు క్ర‌మంగా న‌ల్ల బ‌డుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube