మీలో ఎంతమందికి గుర్తుంది అంజలి మరియు హీరో మహేష్ కలిసి నటించిన షాపింగ్ మాల్ సినిమా.( Shopping Mall Movie ) ఈ సినిమా తమిళంలో అంగాడి తెరు( Angadi Theru ) అనే పేరుతో విడుదల అయింది.
ఆ తర్వాత తెలుగులో డబ్బింగ్ చేయబడింది.తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది అయితే ఆ సినిమాలో నటించిన అంజలి( Anjali ) ఈ రోజు స్టార్ హీరోయిన్ గా సౌత్ ఒక వెలుగు వెలుగుతుండగా హీరో మహేష్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
మరి హీరో మహేష్( Hero Mahesh ) ఏమయ్యాడు ప్రస్తుతం అతడి పరిస్థితి ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మహేష్ తమిళనాడులోని దిండుగల్ అనే ప్రాంతంలో పుట్టాడు.అతడు జాతీయ స్థాయిలో వాలీబాల్ క్రీడాకారుడిగా ఉన్న సమయం లోనే షాపింగ్ మాల్ సినిమా ఆఫర్ వచ్చింది.ఒకరోజు వాలీబాల్ టోర్నమెంట్ ఆడి రోడ్డు దాటుతున్న అతడిని ఆపి దర్శకుడు వసంత బాలన్( Director Vasanthabalan ) అసిస్టెంట్స్ చూడ్డానికి బాగున్నావు మా సినిమాలో హీరోగా చేస్తావా అంటూ అడిగారట.
కానీ అతడు జాతీయ స్థాయిలో టోర్నమెంట్ ఆడుతున్నాడు కాబట్టి అప్పుడు ఇంట్రెస్ట్ లేదని చెప్పి వెళ్లిపోయాడట.ఆ తర్వాత వసంత్ బాలన్ అసిస్టెంట్స్ తరచూ ఫోన్లు చేసి అడిగేవారట.
అప్పటికి కేవలం ఇంటర్ మాత్రమే పూర్తి చేసిన మహేష్ వయసు 18 ఏళ్లు.
సినిమా రంగం గురించి ఏమీ తెలియదు.కానీ ఆ సమయంలోనే వాలీబాల్( Volleyball ) ఆడుతున్న సమయంలో కాలికి గాయం కాగా కోచ్ ఆ గాయాన్ని చూసి ఈ గాయంతో ఎక్కువ కాలం టోర్నమెంట్ ఆడలేవు.కానీ సినిమా అవకాశాలు ఎప్పుడు పడితే అప్పుడు రావు ఓసారి ప్రయత్నించు.
బాగుంటే ఓకే లేదంటే వచ్చి మళ్ళీ ఆడు కానీ అని చెప్పారట.దాంతో షాపింగ్ మాల్ సినిమా కోసం వెళ్లాడు.
దాదాపు 180 రోజుల పాటు సినిమా షూటింగ్ చేసారు.ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు.
కానీ ఆ చిత్రం తర్వాత దాదాపు 14 సినిమాల్లో నటించిన కూడా మహేష్ కి మళ్ళీ విజయం దక్కలేదు.
దాంతో చాలా రోజులు డిప్రెషన్ కి వెళ్ళిపోయి మందుకు కూడా బానిస అయ్యాడు.ప్రస్తుతం అతడు మంచి సినిమా అవకాశం కోసం వెతుకుతున్నాడు.పెళ్లి చేసుకోకుండా సినిమాలే ప్రపంచంగా బ్రతుకుతున్నాడు.
ఇప్పటికైనా ఎవరైనా మంచి అవకాశం ఇవ్వకపోతే ఎదురు చూస్తున్నాడు.సినిమాలోకి రాకపోయి ఉండి ఉంటే ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటాలో ఆర్మీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగంలో ఉండేవాడు.
తనతో వాలీబాల్ ఆడిన స్నేహితులంతా కూడా బాగా సెటిలైపోయారు.తను మాత్రం సినిమాల పైన ఫోకస్ చేసి ఎటు కాకుండా మిగిలిపోయాడు అని మహేష్ బాధపడుతున్నాడు.
పైగా జర్నీ సినిమాలో( Journey Movie ) శర్వానంద్( Sharwanand ) పాత్ర మొదట మహేష్ కే వచ్చిందట.కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాడట.
అలాగే విజయ్ సేతుపతి కెరియర్ లోనే అతిపెద్ద హిట్టుగా ఉన్న తెన్మేర్కు పరువకాట్రు అనే సినిమా కూడా మహేష్ చేజారిపోయిన సినిమానే.ఇలా స్టార్ హీరో కావాల్సిన మహేష్ ఈ రోజు ఎటు కానీ పరిస్థితుల్లో మిగిలిపోయాడు.