ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం( MLA Koneti Adimulam ) టీడీపీలోకి చేరనున్నారని తెలుస్తోంది.
నిన్న రాత్రి టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) ను ఆదిమూలంతో పాటు ఆయన కుమారుడు సుమన్ కలిశారు.త్వరలోనే అధికారికంగా టీడీపీలో చేరనున్నారు.
అయితే మార్పులు చేర్పుల్లో భాగంగా వైసీపీ అధిష్టానం ఆదిమూలంను తిరుపతి పార్లమెంట్ ఇంఛార్జ్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీనిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆదిమూలం వైసీపీ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy )పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఆ తరువాత రెండు రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న ఆదిమూలం నిన్న రాత్రి లోకేశ్ ను కలిశారు.రానున్న రెండు, మూడు రోజుల్లో చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరతారని సమాచారం.