ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలోకి వలసలు..!
TeluguStop.com
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం( MLA Koneti Adimulam ) టీడీపీలోకి చేరనున్నారని తెలుస్తోంది.
నిన్న రాత్రి టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) ను ఆదిమూలంతో పాటు ఆయన కుమారుడు సుమన్ కలిశారు.
త్వరలోనే అధికారికంగా టీడీపీలో చేరనున్నారు.అయితే మార్పులు చేర్పుల్లో భాగంగా వైసీపీ అధిష్టానం ఆదిమూలంను తిరుపతి పార్లమెంట్ ఇంఛార్జ్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
"""/" /
దీనిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆదిమూలం వైసీపీ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy )పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఆ తరువాత రెండు రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న ఆదిమూలం నిన్న రాత్రి లోకేశ్ ను కలిశారు.
రానున్న రెండు, మూడు రోజుల్లో చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరతారని సమాచారం.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన అబ్బాయి.. ఈ అబ్బాయి ఎవరంటే?