రేవంత్ కు 'చేయి' ఇచ్చేస్తున్నరా ? అరెస్ట్ వ్యక్తిగతమటగా ?

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలో ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.వాస్తవంగా చెప్పుకుంటే తెలంగాణ కాంగ్రెస్ కు ఊపు తీసుకురావడంలో రేవంత్ పాత్ర చాలానే ఉంది.

 What Is Revanth Reddy Fires On Congress Party-TeluguStop.com

భవిష్యత్తులో కూడా ఆ పార్టీకి మైలేజ్ తీసుకువచ్చే విధంగా వ్యవహరిస్తారనే విషయంలో సందేహం లేదు.టిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్, కేటీఆర్ లను సమర్ధవంతంగా ఎదుర్కొని వారి దూకుడుకు కళ్లెం వేయడంలో రేవంత్ చురుకైన పాత్ర ఇప్పటికీ పోషిస్తూ వస్తున్నారు.

అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న గ్రూపు రాజకీయాలు, వర్గ విభేదాలు కారణంగా రేవంత్ అడుగడుగునా ఇబ్బందిపడుతునే వస్తున్నారు.అయినా అన్ని వడిదుడుకులు ఎదుర్కుంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంపాదించారు.

ప్రస్తుతం టి.పిసిసి అధ్యక్ష పదవి రేసులో ఆయన ఉన్నారు.అధిష్టానం పెద్దలు రేవంత్ రెడ్డి విషయంలో సానుకూలంగా ఉండడంతో ఆయనకు బాగానే ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది.రేవంత్ రాజకీయ ఎదుగుదల కారణంగా తమ రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుందని భావిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు కొంతమంది రేవంత్ రెడ్డి హవా తెలంగాణలో తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫార్మ్ హౌస్ లో డ్రోన్ కెమెరా ఎగరవేసిన కేసులు రిమాండ్ లో ఉన్నారు.అయితే రేవంత్ వ్యవహారం లో కాంగ్రెస్ సీనియర్లు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారు.

ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్ హౌస్ విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటాన్ని ఆయన వ్యక్తిగత అంశంగా చూస్తున్నామని, దీనికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గుర్తించిన అంశాన్ని పార్టీలో కానీ, తమతో కానీ చర్చించలేదని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

Telugu Congress, Jagga Reddy, Revanth Reddy-Telugu Political News

111 జీవో వల్ల అక్కడి రైతులు ఇబ్బందులు పడుతున్నారనే కోణం నుంచి మాత్రమే తాము స్పందిస్తామని, రైతులకు న్యాయం జరిగేలా ఆ జీవో ఎత్తివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని జగ్గారెడ్డి చెప్పారు.రేవంత్ రెడ్డి మీద కేసు ఆయన వ్యక్తిగతంగానే ఎదుర్కోవాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.కేసీఆర్ ఫామ్ హౌస్ విషయంలో ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతున్నా ఇప్పటివరకు ఎక్కడ దానిపై కేటీఆర్ స్పందించలేదు.

ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ అధిష్టానం కూడా మౌనంగా ఉంది.దీంతో రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

జైలు నుంచి రేవంత్ బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో సొంతంగా పార్టీ పెడతారా లేక కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరతారా అనేది సస్పెన్స్ మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube