హిమాలయన్ గోల్డ్ అంటే ఏమిటి? దాని కోస‌మే చైనా సైనికులు మ‌న దేశంలో చొర‌బడ్డారా?

హిమాలయన్ గోల్డ్ ధ‌ర చైనాలో వజ్రం, బంగారం కంటే ఎక్కువ.దీనిని కార్డిసెప్స్ ఫంగస్ అని కూడా పిలుస్తారు.

 What Is Himalayan Gold Did The Chinese Soldiers Enter Our Country For That Detai-TeluguStop.com

ఇది టిబెట్, భూటాన్, ఇండియా, చైనా, నేపాల్‌లోని ఎత్త‌యిన‌ హిమాలయ ప్రాంతాలలో సహజంగా లభించే అత్యంత విలువైన మూలిక.అందుకే దీనిని హిమాలయన్ గోల్డ్ అని కూడా అంటారు.

ఇటీవల చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడినట్లు వార్త‌లు వ‌చ్చాయి.కొన్ని మీడియా రిపోర్టుల‌ ప్రకారం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులు ఈ విలువైన మూలిక‌ల‌ను సేకరించేందుకు భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోకి చొర‌బ‌డ్డార‌ని స‌మాచారం.

ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేన‌ప్ప‌టికీ నపుంసకత్వం నుండి జీర్ణక్రియ వరకు ప్రతివైద్యానికీ చైనాలోని మధ్యతరగతి వారు ఈ సర్వరోగ నివారిణిని కోసం వెదుకుతుంటారు.

కార్డిసెప్స్ ఫంగస్ అంటే ఏమిటి?

ఒక అధ్యయనం ప్రకారం కార్డిసెప్స్ అనేది పరాన్నజీవి ఫంగస్ గొంగళి పురుగుల లార్వాలపై పెరుగుతుంది.ఇది చైనీస్ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించే విలువైన ఔషధ మూలికల‌లో ఒక‌టి.కార్డిసెప్స్ అనేది పరాన్నజీవి శిలీంధ్రాల జాతి.ఇది ఫంగస్ యొక్క కణజాలంపై దాడి చేస్తుంది.దారి తీరును మారుస్తుంది.

దీని కారణంగా ఫంగస్ నుండి పొడవైన సన్నని కాండం పెరుగుతుంది.దీనిని ఎండబెట్టిన త‌రువాత‌ అనేక వ్యాధులలో ఉపయోగిస్తుంటారు.

Telugu China, Fungus, Himalayan Gold, Himalayas, India-Latest News - Telugu

కార్డిసెప్స్ ఫంగస్ అందించే ప్రయోజనాలు

మీడియాకు అందిన వివ‌రాల‌ ప్రకారం సహజమైన కార్డిసెప్స్ రోగనిరోధక శక్తిని పెంచడానికి, క్యాన్సర్ కణాలతో పోరాడటానికి, కణితుల పరిమాణాన్ని త‌గ్గించ‌డానికి, ముఖ్యంగా ఊపిరితిత్తుల లేదా చర్మ క్యాన్సర్‌ను తగ్గించడంలో ఈ మూలిక సహాయపడుతుంది.మ‌రికొంద‌రు మూత్రపిండాల రుగ్మతల నివార‌ణ‌, కాలేయ సమస్యలు, లైంగిక సమస్యల ప‌రిష్కారం కోసం కార్డిసెప్స్‌ను ఉపయోగిస్తుంటారు.అయితే ఇలా ఉపయోగించ‌డం వెనుక ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Telugu China, Fungus, Himalayan Gold, Himalayas, India-Latest News - Telugu

ఆరోగ్యానికి హానిక‌రం

కార్డిసెప్స్ ఒక‌ సంవత్సరం పాటు ప్రతిరోజూ 3 నుంచి 6 గ్రాముల మోతాదులో తీసుకున్నప్పుడు చాలా మందికి సురక్షితంగానే ఉంటుంది.దీని కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల అతిసారం, మలబద్ధకం, పొత్తికడుపులో అసౌకర్యం మొద‌లైన‌ తేలికపాటి దుష్ప్రభావాలు సంభవిస్తాయి.

దీనిని హిమాలయన్ గోల్డ్ అని ఎందుకు అంటారు?

మీడియాకు అందిన వివ‌రాల‌ ప్రకారం కార్డిసెప్స్ ఫంగస్ లేదా ‘హిమాలయన్ గోల్డ్’ చైనాలో బంగారం లేదా వజ్రాల కంటే చాలా ఖరీదైనది.దీనికి ఎంతో డిమాండ్ ఉంది.అందుకే ఇది ఎంతో ఖరీదైనదిగా మారింది.ఈ ఔషధ మూలిక ఒక కిలోగ్రాము ధ‌ర అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.65 లక్షలు ప‌లుకుతోంది.2022లో దీని మార్కెట్ విలువ $1,072.50 మిలియన్లుగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube