దాసరి, హీరో శోభన్ బాబు మధ్య అలాంటి సంభాషణ.. చివరికి ఏం జరిగిందంటే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా స్టార్ హీరోలు మంచి పేరు ఉన్న దర్శకులకు మాత్రమే అవకాశాలు ఇస్తుంటారు.ఇది ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్న పరిస్థితి.

 What Is The Conversation Between Dasari And Shoban Babu, Dasari, Shobhan Babu,-TeluguStop.com

కొత్తగా ఏ దర్శకుడైన ఇండస్ట్రీలోకి అడుగు పెడితే తనకు స్టార్ హీరోల నుంచి అవకాశాలు రావడం చాలా అరుదని చెప్పవచ్చు.అయితే కొత్తగా వచ్చిన వారికి కూడా అవకాశం ఇవ్వాలి కనుక కొందరు హీరోలు మాత్రం ఎంతో ధైర్యం చేసి ఆ దర్శకులకు అవకాశాలు ఇస్తుంటారు.

ఇలాంటి ఘటన లెజెండరీ డైరెక్టర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న దాసరి నారాయణరావు కూడా ఎదురైందని చెప్పవచ్చు.

దాసరి నారాయణరావు ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో శోభన్ బాబును దృష్టిలో ఉంచుకొని “తాతా మనవడు” కథను రాశారు.

ఈ సినిమాలో ఎస్ వి రంగారావు రాజబాబు నటించడంతో ఈ సినిమా ద్వారా వారికి ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.నిజానికి ఈ సినిమాలో రాజబాబు పాత్రలో శోభన్ బాబును ఊహించుకొని కథ సిద్ధం చేసుకున్నారు దర్శకుడు దాసరి.

అయితే దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి కొత్తగా రావడంతో అతనితో సినిమా చేయడానికి శోభన్ బాబు ధైర్యం చేయలేకపోయారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాను ఎస్ వి రంగారావు రాజబాబుతో దాసరి నారాయణరావు తెరకెక్కించారు.

Telugu Dasari, Tollywood, Nandi Award, Rajababu, Shobhan Babu, Sv Rangaravu, Tat

ఈ సినిమా థియేటర్లలో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది.అంతేకాకుండా ఈ సినిమాకు నంది అవార్డు రావడం గొప్ప విశేషమని చెప్పవచ్చు.ఈ విధంగా మొదటి సినిమాకి నంది అవార్డు దక్కించుకున్న దాసరి నారాయణరావు సినిమా ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు.అయితే ఈ సినిమాలో నటించినందుకు గానూ శోభన్ బాబు ఎంతో ఫీలయ్యారని, ఆ తరువాత పలు సార్లు దాసరి నారాయణరావు కనిపించినప్పుడు తన దగ్గర ఇదే విషయాన్ని మాట్లాడేవారని, ఆ తర్వాత శోభన్ బాబు దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube