దాసరి, హీరో శోభన్ బాబు మధ్య అలాంటి సంభాషణ.. చివరికి ఏం జరిగిందంటే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా స్టార్ హీరోలు మంచి పేరు ఉన్న దర్శకులకు మాత్రమే అవకాశాలు ఇస్తుంటారు.

ఇది ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్న పరిస్థితి.కొత్తగా ఏ దర్శకుడైన ఇండస్ట్రీలోకి అడుగు పెడితే తనకు స్టార్ హీరోల నుంచి అవకాశాలు రావడం చాలా అరుదని చెప్పవచ్చు.

అయితే కొత్తగా వచ్చిన వారికి కూడా అవకాశం ఇవ్వాలి కనుక కొందరు హీరోలు మాత్రం ఎంతో ధైర్యం చేసి ఆ దర్శకులకు అవకాశాలు ఇస్తుంటారు.

ఇలాంటి ఘటన లెజెండరీ డైరెక్టర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న దాసరి నారాయణరావు కూడా ఎదురైందని చెప్పవచ్చు.

దాసరి నారాయణరావు ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో శోభన్ బాబును దృష్టిలో ఉంచుకొని "తాతా మనవడు" కథను రాశారు.

ఈ సినిమాలో ఎస్ వి రంగారావు రాజబాబు నటించడంతో ఈ సినిమా ద్వారా వారికి ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.

నిజానికి ఈ సినిమాలో రాజబాబు పాత్రలో శోభన్ బాబును ఊహించుకొని కథ సిద్ధం చేసుకున్నారు దర్శకుడు దాసరి.

అయితే దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి కొత్తగా రావడంతో అతనితో సినిమా చేయడానికి శోభన్ బాబు ధైర్యం చేయలేకపోయారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాను ఎస్ వి రంగారావు రాజబాబుతో దాసరి నారాయణరావు తెరకెక్కించారు.

"""/"/ ఈ సినిమా థియేటర్లలో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది.అంతేకాకుండా ఈ సినిమాకు నంది అవార్డు రావడం గొప్ప విశేషమని చెప్పవచ్చు.

ఈ విధంగా మొదటి సినిమాకి నంది అవార్డు దక్కించుకున్న దాసరి నారాయణరావు సినిమా ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు.

అయితే ఈ సినిమాలో నటించినందుకు గానూ శోభన్ బాబు ఎంతో ఫీలయ్యారని, ఆ తరువాత పలు సార్లు దాసరి నారాయణరావు కనిపించినప్పుడు తన దగ్గర ఇదే విషయాన్ని మాట్లాడేవారని, ఆ తర్వాత శోభన్ బాబు దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్నాయి.

పెద్ది మూవీ ఇండస్ట్రీ హిట్ కావడం పక్కా.. ఈ విషయాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!