వెబ్ సిరీస్ లకు సెన్సార్ కట్ లేకపోవడంతో రెచ్చిపోతున్నారుగా...

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో కొందరు దర్శక నిర్మాతలు తమ చిత్రాలను  ప్రముఖ ఓటీటీ  ప్లాట్ ఫారంలలో  విడుదల చేస్తూ బాగానే సొమ్ము చేసుకుంటున్నారు.అయితే మరోవైపు చిన్న చిన్న దర్శకులు సీరీస్ లను రూపొందిస్తూ బాగానే డబ్బులు, కొత్త కొత్త సినిమాల అవకాశాలను సంపాదిస్తున్నారు.

 Cine Critics, Sensor Cut Terms And Conditions, Web Series, Tollywood-TeluguStop.com

ఈ క్రమంలో వెబ్ సిరీస్ లకు సెన్సార్ కట్స్ లేకపోవడంతో శృంగార భరిత తరహా సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

దీనికి తోడు కొన్ని ఇతర భాషా వెబ్ సీరీస్ లు  స్థానిక భాషలలో అనువాదం చేసినప్పటికీ అసభ్య పదజాలాన్ని తొలగించకుండా అడల్ట్ కంటెంట్ ఉన్నటువంటి వెబ్ సిరీస్ లపై కొందరు సినీ క్రిటిక్స్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాక మామూలుగా సినిమాలలో మంచి, చెడులను చూపించడం ఒకెత్తయితే ఇలా చెడు ను మాత్రమే టార్గెట్ చేస్తూ చూపించడం వల్ల సినీ ప్రేక్షకులకు సినిమాలపై ఉన్నటువంటి అభిప్రాయం పూర్తిగా మారిపోతుందని కాబట్టి వెబ్ సిరీస్ లకు కూడా సెన్సార్ కట్స్ నిబంధనలు అమలు చేయాలని వాపోతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో లో విడుదలైన “రాస్ భరి, మీర్జాపూర్”, తదితర వెబ్ సిరీస్ లు తెలుగు భాషలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.

ఈ వెబ్ సిరీస్ లలో ఎక్కువగా మంచి కంటే అసభ్య పదజాలం, శృంగార భరిత సన్నివేశాలు వంటివి ఎక్కువగా ఉన్నాయి.దీంతో ఎక్కువమంది ఇలాంటి వాటి వల్ల తప్పుదోవ పట్టే అవకాశం ఉందని కొంతమంది సినీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాబట్టి ఇప్పటికైనా వెబ్ సిరీస్ దర్శక నిర్మాతలు సెన్సార్ కట్ నిబంధనలకు అనుగుణంగా తమ చిత్రాలను తెరకెక్కించాలని లేక పోతే  భవిష్యత్తులో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube