మోసాలకు పాల్పడ్డ ఆర్ఎక్స్ 100 డైరెక్టర్.. పోలీసు కేసు నమోదు

టాలీవుడ్‌లో ఆర్ఎక్స్ 100 అనే యూత్‌ఫుల్ బోల్డ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ఆ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే.కేవలం ఒకేఒక్క సినిమాతో ఇండస్ట్రీ చూపును తనవైపు తిప్పుకున్నాడు.

 Fraud On Ajay Bhupathi Name, Ajay Bhupathi, Vijay Devarakonda, Fruad, Crime News-TeluguStop.com

కాగా తన నెక్ట్స్ మూవీని పట్టాలెక్కించేందుకు అజయ్ భూపతి రెడీ అవుతున్నాడు.అయితే తన నెక్ట్స్ చిత్రంలో నటీనటులు కావాలనే యాడ్‌ను సోషల్ మీడియాలో అజయ్ భూపతి పేరుతో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఇది నమ్మిన కొందరు ఆ యాడ్‌లోని నెంబర్‌కు ఫోన్ చేయగా వారు సినిమా ఛాన్స్ కావాలంటే, రూ.25 వేలు సమర్పించుకోవాలని తెలపడంతో చాలా మంది డబ్బులు ఇచ్చి సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూడసాగారు.అయితే ఇదంతా ఎవరో అజయ్ భూపతి పేరుపై చేస్తున్నారనే విషయాన్ని గ్రహించిన సదరు దర్శకుడు వెంటనే అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించాడు.ఎవరో మోసగాళ్లు ఇలా తనపేరును వాడుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలుసుకున్న అజయ్ భూపతి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో పోలీసులు ఈ మోసం వెనుక ఉన్నవారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సినిమా-టీవీ ఛాన్సుల పేరిట డబ్బులు దోచుకునే నేరగాళ్ల నుండి జాగ్రత్తగా ఉండాలని అజయ్ భూపతి కోరాడు.

ఇక తన నెక్ట్స్ మూవీ ‘మహాసముద్రం’ను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్న అజయ్ భూపతి, ఇప్పటికే ఈ సినిమాలోని నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube