ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి చైనా లోనే పురుడుపోసుకుంది,ఆ వైరస్ కు సంబంధించి ఆగష్టులోనే కేసులు బయటపడినప్పటికీ బయటకు రాకుండా డ్రాగన్ దేశం వ్యవహరించింది అంటూ అగ్రరాజ్యం అమెరికా తో పాటు చాలా దేశాలు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ వైరస్ పై చైనా సమాచారాన్ని తమతో షేర్ చేసుకుందని కానీ అప్పటికే ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకిపోయింది అంటూ చెప్పుకొచ్చిన WHO తాజాగా మాట మార్చింది.
ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న ఈ కరోనా వైరస్ గురించి మొదట చైనాలోని తమ కార్యాలయమే వెల్లడించింది అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం విశేషం.కోవిద్-19 తొలి దశ గురించి… ముఖ్యంగా మొదటి న్యుమోనియా కేసుల గురించి తామే అలర్ట్ చేసినట్టు WHO స్పష్టం చేసింది.అయితే అగ్రరాజ్యం అమెరికా తో సైతం పలు దేశాలు కరోనా వైరస్ కు సంబంధించి ముందే తెలిసినప్పటికీ కూడా చైనా బయటకు రాకుండా తొక్కి పెట్టింది అని ఆరోపిస్తుండగా,చైనా మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.గత ఏప్రిల్ 9 న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.
తన కమ్యూనికేషన్లకు సంబంధించిన తొలి టైం లైన్ ని ప్రచురించింది.
ట్రంప్ ఈ సంస్థను కూడా తప్పు పట్టి… దీనికి నిధులను స్తంభింపజేసిన నేపథ్యంలో.
దాదాపు వివరణ ఇచ్చింది.హుబే ప్రావిన్స్ లోని వూహాన్ మున్సిపల్ హెల్త్ కమిషన్.
డిసెంబరు 31 న న్యుమోనియా కేసుల గురించి ప్రస్తావించింది.అయితే దీని విషయమై ఎవరు నోటిఫై చేశారన్న అంశాన్ని మాత్రం పక్కన పెట్టింది.
అయితే ఈ వైరస్ కు సంబంధించి తొలి సమాచారం మొదట చైనా నుంచి వచ్చిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసిస్ గత ఏప్రిల్ 20 న ప్రకటించగా, అయితే దీన్ని చైనా అధికారులు పంపారా లేక మరేదైనా వర్గాల నుంచి అందిందా అన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు.తాజాగా ఈ వారంలో ప్రచురితమైన ఓ నివేదికలో ఇలాంటి విషయాలు వెల్లడైనట్లు తెలుస్తుంది.
చైనాలోని తమ కార్యాలయమే గత డిసెంబరు 31 న వైరస్ న్యుమోనియా కాంటాక్ట్ కేసుకు సంబంధించి సమాచారాన్ని నోటిఫై చేసిందనిఈ నివేదికలో పేర్కొన్నారు.వూహాన్ హెల్త్ కమిషన్ వెబ్ సైట్ లో కనుగొన్న డిక్లరేషన్ ఆధారంగా దీనిని నోటిఫై చేసినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది.
అదే రోజున తమ సంస్థలోని ఎపిడమిక్ ఇన్ఫర్మేషన్ విభాగం.అమెరికాలోని ఇంటర్నేషనల్ ఎపిడెమియోలాజికల్ సర్వేలెన్స్ నెట్ వర్క్ అయిన.’ప్రో-మెడ్’ ట్రాన్స్ మీట్ చేసిన మరో వార్తను కూడా ప్రచురించిందని పేర్కొన్నారు.