1.న్యాయ సుధ మంగళ మహోత్సవం
నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్డుల ఆధ్వర్యంలో ‘న్యాయసుధ మంగళ” మహోత్సవం ఘనంగా జరిగింది.
2.కార్మిక శాఖ జాతీయ సదస్సు
నేడు తిరుపతి సార్ హోటల్ లో కార్మిక శాఖ జాతీయ సదస్సు సాయంత్రం నాలుగున్నర గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవ సందేశం వినిపించనున్నారు.
3.నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన
నేడు రెండో రోజు కుప్పం నియోజకవర్గం లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు.
4.నేడు విశాఖలో కేంద్ర మంత్రి పర్యటన
నేడు, రేపు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ విశాఖలో పర్యటించనున్నారు.
5.విజయవాడలో జాబ్ మేళా
నేడు విజయవాడ ప్రభుత్వ ఐటిఐ కాలేజ్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
6.నేడు విజయవాడకు నిజామాబాద్ బిజెపి ఎంపీ రాక
విజయవాడ బిజెపి కార్యాలయానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి రానున్నారు.మీడియా ప్రతినిధులతో ఆయన భేటీ కానున్నారు.
7.మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు
త్వరలో జరగబోయే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును దాదాపు ఫైనల్ చేశారు.
8.రాజా సింగ్ వీడియో పై అసిదుద్దీన్ కామెంట్స్
బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పోస్ట్ చేసిన వీడియోతో ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
9.రాజా సింగ్ కు పోలీసుల నోటీసులు
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు 41 ఏ సీఆర్సీ కింద నోటీసులు జారీ చేశారు.
10.నేడు హనుమకొండలో గవర్నర్ పర్యటన
నేడు తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో గవర్నర్ తమిళ సై పర్యటించనున్నారు.కాకతీయ యూనివర్సిటీ లో 22 వ స్నాతకోత్సవానికి ఛాన్సలర్ హోదాలో గవర్నర్ పాల్గొననున్నారు.
11.తెలుగు కవులకు సాహిత్య అకాడమీ అవార్డులు
ఉభయ తెలుగు రాష్ట్రాల కవులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించాయి.తెలంగాణకు చెందిన ప్రముఖ కవి రచయిత పత్తిపాకం మోహన్ కు ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహితీ పురస్కారం లభించింది.అలాగే ఏపీకి చెందిన కవి ఉపాధ్యాయుడు పల్లిపట్టు నాగరాజుకు యువ పురస్కారం దక్కింది.
12.నీటిపారుదల శాఖపై 3,343 కేసులు
తెలంగాణ నీటి బురదల శాఖకు వ్యతిరేకంగా హైకోర్టులో ఇప్పటివరకు 3,343 కేసులు రాష్ట్ర హైకోర్టులో దాఖలు అయినట్లు గుర్తించారు.
13.ఉప ఎన్నికకు మోదీ, అమిత్ షాలే కారణం
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షానే కారణమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.
14.ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి గుండెపోటు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గుండుపోటుకు గురయ్యారు.జూబ్లీహిల్స్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఆయనను చేర్పించారు.
15.ధర్నాకు దిగిన చంద్రబాబు
కుప్పంలో అన్న క్యాంటీన్ వద్ద రోడ్డుపై టీడీపీ అధినేత చంద్రబాబు ధర్నాకు దిగారు.
16.జగన్ ఇల్లు ముట్టడిస్తాం : అచ్చెన్న
కుప్పంలో అల్లర్లను అదుపు చేయకపోతే జగన్ ఇల్లు ముట్టడిస్తామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు హెచ్చరించారు.
17.కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ధర్మపురి అరవింద్ కామెంట్స్
త్వరలోనే భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిజెపిలో చేరతారని నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
18.నారా లోకేష్ వార్నింగ్
కుప్పం నియోజకవర్గం జోలికి వస్తే తాట తీస్తామని వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు.
19.నేడు సుప్రీంకోర్టు ముందుకు హై ప్రొఫైల్ కేసులు
నేడు సుప్రీంకోర్టు ముందుకు కీలక కేసులు విచారణకు రానున్నాయి.దేశంలో ప్రముఖంగా ఉన్న బిల్కీస్ భాను కేసు నుంచి తీస్తా సేతల్వాడ్ కేసు, మనీ లాండరింగ్ నిరోధక చట్టం, పెగాసస్ ఫైవ్ వేర్ కేసు, ప్రధానమంత్రి సెక్యూరిటీ లోపాలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,500 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 51,820
.