వి వి వినాయక్ పరిస్థితి మరీ దారుణంగా తయారైందిగా.. దీనికి కారణమేంటి..?

ఒకప్పుడు తెలుగులో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వివి వినాయక్ ( Vv Vinayak )ప్రస్తుతం సినిమాలు ఏమి చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు.అయితే ఒకానొక టైమ్ లో రాజమౌళితో పోటీపడి రాజమౌళి( Rajamouli ) కంటే దిగ్గజ దర్శకుడుగా పేరుపొందిన వినాయక్ పరిస్థితి ఇలా ఉండడం తెలుగు సినిమా అభిమానులకు మింగుడు పడడం లేదు దాని వల్లే ఆయన మళ్లీ సినిమాలు చేస్తే చూడాలని ఉంది అంటూ మరి కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

 Vv Vinayak's Situation Has Become So Bad What Is The Reason For This , V V Vinay-TeluguStop.com

ఇక రీసెంట్ గా ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్( Bellamkonda Sai Srinivas ) ని హీరోగా పెట్టీ హిందీలో తీసిన ఛత్రపతి సినిమా( Chatrapati movie ) చేసినప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.ఇక దాంతో ఆయన తో సినిమాలు చేసే హీరో కరువయ్యాడనే చెప్పాలి.మరి ఆయన లాంటి దర్శకుడు ఇలా డీలాపడడానికి కారణం ఏంటి అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఆయనతోపాటు సినిమాలు తీసిన పూరి జగన్నాథ్ రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి దర్శకులు ఇప్పుడు కూడా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుంటే ఆయన మాత్రం చాలా వరకు వెంకబడ్డాడు అనే చెప్పాలి.

 VV Vinayak's Situation Has Become So Bad What Is The Reason For This , V V Vinay-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలో ఆయన సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే వార్తలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.ఇక ఆయన హీరోగా సీనయ్య( Seenayya ) అనే సినిమా అని కూడా మొదలుపెట్టాడు అయినప్పటికీ ఆ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది.ఇక ఇదంతా చూస్తున్న తెలుగు ప్రేక్షకులు వినాయక్ పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది అంటూ ఆయన విషయంలో వాళ్ల బాధని వ్యక్తం చేస్తున్నారు.మరి ఆయన మళ్ళీ ఒక మంచి హీరోని ఎంచుకొని సినిమా చేసి సక్సెస్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube