సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) విశిష్ట సేవలు అందించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును( Padma Vibhushan Award ) సత్కరించిన విషయం తెలిసిందే.తాజాగా మెగాస్టార్ చిరంజీవిని ఈ అవార్డు వరించింది అని తెలియడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా పండుగ చేసుకుంటున్నారు.
దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా మెగాస్టార్ చిరంజీవి పేరు ఎక్కువగా వినిపిస్తోంది.ఈ నేపథంలోనే మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

అందులో భాగంగానే మెగాస్టార్ కి ఈ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ చిరు సోదరుడు, సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కూడా స్పందించారు.తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు తెలిపారు.భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషి తో సాధించుకున్న అన్నయ్య చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది అని పవన్ కల్యాణ్ తెలిపారు.నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారు.
కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు అంటూ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు పవన్ కళ్యాణ్.అలాగే సామాజిక సేవా రంగంలో అన్నయ్య చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి.

పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా తన సోదరుడికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.కాగా పద్మ విభూషణ్ తెలుగు నాయకుడు మాజీ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడుకు( Venkaiah Naidu ) కూడా వరించిన విషయం తెలిసిందే.ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్.వెంకయ్య నాయుడు పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం ముదావహం అని పేర్కొన్నారు.విద్యార్థి నాయకుడి దశ నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ఆయన.సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నారని చెప్పారు.ఆయన వాగ్ధాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవని కొనియాడారు పవన్.







