మహిళల్లో చాలామంది ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో రక్తహీనత( Anemia ) అనేది ముందు వరుసలో ఉంటుంది.పోషకాహారం తీసుకోకపోవడం, ప్రెగ్నెన్సీ, నెలసరి తదితర కారణాల వల్ల మహిళల్లో తరచూ రక్తహీనత ఏర్పడుతుంది.
దీని కారణంగా నీరసం, అలసట, బలహీనత, కళ్ళు తిరగడం, చర్మం పాలిపోవడం ఇలా ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి.వీటన్నిటిని అధిగమించాలంటే రక్తహీనతను తరిమి కొట్టడం ఎంతో అవసరం.
అందుకు కొన్ని కొన్ని ఆహారాలు ఉత్తమంగా సహాయ పడతాయి.ఈ జాబితాలో అటుకులు( Poha ) కూడా ఒకటి.
అటుకులు తినడానికి రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలను సైతం కలిగి ఉంటాయి.ముఖ్యంగా అటుకుల్లో ఐరన్ రిచ్ గా ఉంటుంది.
రక్తహీనతను తరిమి కొట్టడానికి అటుకులు అద్భుతంగా సహాయపడతాయి.అయితే అటుకులు ఎలా తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు అటుకులు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో మూడు స్పూన్లు బాదం పలుకులు, మూడు స్పూన్లు జీడిపప్పు పలుకులు( Cashews ) వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మళ్లీ అదే పాన్ లో ఒక కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఖర్జూరం వేసి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై అందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు తేనె( Honey ) వేసి ఐదారు నిమిషాల పాటు ఉడికిస్తే పాకంలా తయారవుతుంది.
అప్పుడు అందులో వేయించిన అటుకులు, జీడిపప్పు-బాదం పలుకులు మరియు హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరి చుట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

ఈ అటుకుల లడ్డు తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది.పైగా ఈ లడ్డూను మహిళలు రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే ఐరన్ కంటెంట్ లభిస్తుంది.హిమోగ్లోబిన్ శాతం( Hemoglobin ) పెరుగుతుంది.రక్తహీనత దూరమవుతుంది.అంతేకాదు ఈ అటుకుల లడ్డూను తినడం వల్ల ఎముకలు పుష్టిగా మారతాయి.మోకాళ్ళ నొప్పులు ఉంటే దూరం అవుతాయి.
బ్రెయిన్ షార్ప్ గా మారుతుంది.జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది.
కంటి చూపు సైతం చురుగ్గా మారుతుంది.కాబట్టి ఈ హెల్తీ అటుకుల లడ్డూ( Poha Ladoo )ను తప్పకుండా డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.