బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ( Anchor Vishnupriya ) ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.కవర్ సాంగ్స్, టీవీ షోల ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో ఆమె సంపాదిస్తున్నారు.
తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న విషాదాల గురించి కూడా పలు సందర్భాల్లో విష్ణుప్రియ వెల్లడించడం జరిగింది.కెరీర్ విషయంలో జాగ్రత్త వహిస్తే విష్ణుప్రియ కెరీర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
తాజాగా విడుదలైన సుమ అడ్డా ప్రోమోలో( Suma Adda Promo ) విష్ణుప్రియ ధనరాజ్ ఒక టీమ్ గా వేణు చమ్మక్ చంద్ర మరో టీమ్ గా వచ్చారు.సుమ మీరందరికీ కూడా ఒక మంచి టాపిక్ ఇస్తున్నానని మీ ఫస్ట్ లవ్ గురించి చెప్పాలని అడగగా అది మంచి టాపిక్ ఎలా అవుతుందని సుమ పంచ్ వేస్తే ఇంటికెళ్లాక సాడ్ టాపిక్ అవుతుందని వేణు కామెంట్ చేశారు.
ఆ తర్వాత సుమ పెళ్లి అనగానే మనకు ఏం గుర్తొస్తాయని అడిగారు.
విష్ణుప్రియ, ధనరాజ్ వెంటనే షాపింగ్, బంధుమిత్రులు, శుభలేఖలు, కళ్యాణ మండపం, బంగారం అని చెప్పుకొచ్చారు.ఆ తర్వాత విష్ణుప్రియ శోభనం గుర్తుకొస్తుందని చెప్పగా ఆ ఆన్సర్ తప్పని సమాధానం వస్తుంది.వేణు వెంటనే శోభనం గుర్తుకొచ్చింది కానీ తాళిబొట్టు గుర్తుకురాలేదా మీకు అని కామెంట్ చేశారు.
ఆ తర్వాత పుష్ప మూవీలోని సామీ సామీ సాంగ్ కు ధనరాజ్, విష్ణుప్రియ కలిసి అదిరిపొయే స్టెప్పులు వేశారు.
ధనరాజ్ మా ఆవిడ జ్యోతికలోకి విష్ణుప్రియ వచ్చేసింది భయ్యా అని చెప్పగా మీ ఆవిడ జ్యోతికలోకి దెయ్యం వచ్చినా వదిలిస్తామేమో కానీ విష్ణుప్రియను మాత్రం వదిలించలేమని అన్నారు.ఈ ప్రోమోకు దాదాపుగా 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ నెల 27వ తేదీన రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని బోగట్టా.