వైరల్: ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైందా? తేడా జరిగితే ప్రాణాలు గాల్లోకే!

ఇక్కడ ఎన్ని ప్రయాణ మార్గాలు వున్నా రైలు ప్రయాణం అనేది అనేక మందికి చాలా ప్రత్యేకం.ఎందుకంటే ట్రైన్ జర్నీ అనేది చాలా సులువైన, సౌకర్యవంతమైన ఛాయిస్ అని చెప్పుకోవాలి.

 Viral: Have You Faced A Similar Situation While Traveling By Train If There Is A-TeluguStop.com

పేద, ధనిక అనే భేదం లేకుండా అందరికీ అందుబాటులో ఉండేడే రైల్వే.అందుకే చాలామంది చాలా మంది రైలు మార్గం గుండా ప్రయాణించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

ఇలా రైలులో వెళ్తున్నప్పుడు పట్టాలకిరువైపులా ఉండే చెట్లు, కిటికీల గుండా కనబడుతున్న పర్యావరణాన్ని చూసి ప్రయాణికులు చాలా ఎంజాయ్ చేస్తూ వుంటారు.

ఈ నేపథ్యంలోనే దేశంలోని నలుమూలల రైల్వే లైన్లు ఏర్పాటయ్యాయి.

కొండ, కోన, వాగు, వంక అనే తేడాలేకుండా మనవాళ్ళు రైల్వే ట్రాక్స్ ఏర్పాటు చేసారు.ఇలాంటి కొన్ని చోట్ల , రైల్వే మార్గాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి.

వాటిని చూస్తేనే మనం భయంతో సగం చచ్చిపోతాం.అలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది పాంబన్ వంతెన.

అవును, సముద్రం పై కట్టిన వంతెన మీదుగా రైలు పరుగులు తీస్తుంటే ఆ దృశ్యాన్ని ఒక్కమాటలో వర్ణించడం కష్టం.

ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఓ రైలు చాలా ప్రమాదకరమైన మార్గం గుండా వెళుతోంది.చిన్న పొరపాటు జరిగినా పెను ప్రమాదం తప్పదని సదరు వీడియో చూస్తేనే మనకు అర్థమవుతోంది.

ఎందుకంటే కింద కొన్ని వందల అడుగులో లోయ ఉంది.అంతెత్తున ఉన్న బ్రిడ్జిపై రైలు వెళ్తుంటే.

ప్రయాణీకుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.కాగా ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరాలుగా స్పందిస్తున్నారు.

‘ఇది ఇంజినీరింగ్‌లో ఓ అద్భుతం’ అంటే కొందరు పొగుడుతుంటే, మరికొందరు ‘రైలు పట్టాలు తప్పితే ఏంటి పరిస్థితి?’ అని ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube