వైరల్: అతడు పాడిన పాట అంతమందిలో ఆ ఒక్క పాపకే నచ్చిందా? నిజంగా క్యూట్ కదూ!

సోషల్ మీడియాలో నిత్యం చాలా వీడియోలు తారసపడుతూ ఉంటాయి.అయితే అందులో ఏ కొన్నో చాలా ప్రత్యేకతని సంతరించుకుంటూ ఉంటాయి.

 Viral: Did He Like That One Song Out Of All The Others,girl, Song ,liked, Viral-TeluguStop.com

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి.అదొక మెట్రోస్టేషన్.

ఆ స్టేషన్ అటునుండి పోయే ప్రయాణికులతో, ఇటునుండి పోయే ప్రయాణికులతో చాలా హడావుడిగా వుంది.ఆ మధ్యలో కూడా ఒక ఔత్సాహికుడు గిటార్ వాయిస్తూ ప్రయాణికులకు ఉపశమనం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నాడు.

కానీ అతని ప్రయత్నం వృధాప్రయాస అయిపోయింది.ఇంతలో ఎక్కడినుండి వచ్చిందో తెలియదు గాని, ఓ క్యూట్ బేబీ అటుగుండగా వెళ్తూ అతగాడు వాయించిన గిటార్ శబ్దానికి స్థాణువై అలా చూస్తూ ఉండిపోతుంది.

ఆ చిన్నారిని చూసిన సదరు ఔత్సాహికుడికి మరింత ఉత్సాహం వస్తుంది.దాంతో మరింత హుషారుగా ఈ వీడియోలో అతగాడు ప్లే చేసిన విధానాన్ని మనం చూడవచ్చు.అక్కడ ఆయనను ఎవరూ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నప్పటికీ ఆ పాప మాత్రం ఆయన సంగీతం, పాటను వింటూ ఆయన వద్దే ఆగిపోయింది.

దీంతో తనకు దొరికిన ఒకే ఒక ప్రేక్షకురాలి కోసం ఆ సంగీతకారుడు చాలా ఆనందంగా పాట పాడుతూ, గిటారు వాయిస్తూ సరదాగా గాల్లో తేలిపోతాడు.ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, ఆ పాప ఎటూ కదలకుడా నిలబడి ఆ సంగీతాన్ని వింటోంది.ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఒకరు వీడియో తీయగా న్యూస్ మూవ్‌మెంట్ సంస్థ తమ సామాజిక మాధ్యమాల ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది.

హృదయాన్ని హత్తుకొనే ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.ఆ సంగీతకారుడు ‘‘వాట్ ఏ వండర్ ఫుల్ వరల్డ్’’ పాట పాడుతూ గిటారు వాయించాడు.ఆ పాప అక్కడికి రాగానే ‘‘వాట్ ఏ వండర్ ఫుల్ గర్ల్’’ అంటూ లిరిక్స్ ను మార్చి పాడటం గమనించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube