వైరల్: బస్సు డ్రైవర్‌తో తలపడిన సైకిలిస్ట్... గెలిచిందెవరో చూసేయండి ఇక్కడ?

‘పోయేకాలం దగ్గరపడితే మనుషుల ప్రవర్తన ఇలాగే ఉంటుంది’ అనే నానుడి మీరు వినే వుంటారు.ఇలాంటి ఘటనలను నిజం చేసే సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.

 Viral Cyclist Annoys Bus Driver By Repeated Braking,bus Driver, Cyclist,viral Vi-TeluguStop.com

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆ మాటే చెబుతారు.ఈ వీడియోని ఒకసారి గమనిస్తే సిటీ బస్సు ముందు వెళ్తున్న ఓ సైక్లిస్ట్ తన మానాన తాను సైకిల్ తొక్కుకుంటూ వెళ్లకుండా ఆ సిటీ బస్సుతో కవ్వింపు చర్యలకు దిగాడు.

దాంతో భారీ మూల్యం చెల్లించుకుని తగిన ఫలితం అనుభవించాడు.

మరి అతగాడికి సిటీ బస్సుని చూసి ఎం అనిపించిందో ఏమిటో గాని, దాని ముందే సైకిల్ తొక్కుతూ ముందుకు పోనివ్వకుండా ఆ బస్సుని ఆనించుకుని మరీ సైకిల్ తొక్కుతూ కవ్వింపు చర్యలకు దిగాడు.

దాంతో చిర్రెత్తిన ఆ బస్సు డ్రైవర్ ఆ సైకిలిస్ట్ కి గుణపాఠం చెబుదామని బస్సును కాస్త సైకిల్ మందికి పోనిచ్చాడు.దాంతో అతడి సైకిల్ వెనుక చక్రం బస్సు కింద పడి నలిగి పూర్తిగా వంగిపోయింది.

దాంతో ఆ సైక్లిస్ట్‌కి తాను చేసిన తప్పేమిటో అర్ధం అయింది.కాదు కాదు… బుద్దొచ్చినట్టు అయింది.

తనవైపు తప్పు ఉండడంతో ఏమీ చేయలేక సైలెంటుగా పక్కకు తప్పుకున్నాడు.అందుకే పెద్దవాళ్ళు మిడసరం పనికిరాదు అనేది.దానికి ఉదాహరణే ఈ వైరల్ వీడియో.కాగా ఈ వీడియో ఇన్స్టంట్ కర్మ అనే ట్విట్టర్ అకౌంట్ వేదికగా Brake checking a bus lol అనే శీర్షికతో పోస్ట్ చేయబడింది.

ఇప్పటివరకు ఈ వీడియో 940k వ్యూస్ రాబట్టింది.కామెంట్లకైతే ఇక లెక్కేలేదు.‘ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు’ అని ఒకరంటే, ‘ఒళ్ళు కొవ్వేక్కితే ఇలాగేవుంటిది’ అని మరొక యూజర్ కామెంట్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube