బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న అషురెడ్డి కొన్ని సినిమాల్లో నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఆమె కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు.ప్రస్తుతం వెండితెర కంటే బుల్లితెర ఆఫర్లకు ప్రాధాన్యతనిస్తున్న అషురెడ్డి బుల్లితెర ఆఫర్లతో బిజీ అవుతున్నారు.
జూనియర్ సమంతగా పేరు సంపాదించుకున్న అషురెడ్డికి సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అషురెడ్డిని అమితంగా అభిమానించే అభిమానులు సైతం ఉన్నారు.
ప్రస్తుతం అషురెడ్డి కామెడీ స్టార్స్ షోతో పాటు హ్యాపీ డేస్ అనే షోను చేస్తున్నారు.ఈ రెండు షోలు అషురెడ్డికి మంచి గుర్తింపునే తెచ్చిపెడుతున్నాయి.
ఫన్నీ వీడియోలు, ఫోటోషూట్ల ద్వారా అభిమానులను ఆకట్టుకునే అషురెడ్డిని ఒక అభిమాని ఆశ్చర్యపోయేలా చేశాడు.అషురెడ్దిపై ఉన్న అభిమానంతో ఆమె పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు.
అభిమాని అషురెడ్డి పేరుతో పాటు ఒక ఎర్ర గులాబీని వేయించుకోగా ఆ టాటూ గురించి ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించిన అషురెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.టాటూ వేయించుకున్న అభిమానికి అషురెడ్డి థ్యాంక్స్ చెప్పారు.టాటూ గురించి ఓ మై గాడ్ అని స్పందిస్తూ ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.ఆ టాటూను చూసిన వెంటనే తనకు ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయని అషురెడ్డి పేర్కొన్నారు.
తాను పలు క్యార్యక్రమాలను హోస్ట్ చేయడం గురించి స్పందిస్తూ హోస్ట్ అవుతానని తనకు తెలుసని కానీ ఇంత త్వరగా హోస్ట్ అవుతానని అనుకోలేదని ఆమె చెప్పుకొచ్చారు.మరోవైపు రాహుల్ సిప్లిగంజ్ తో రిలేషన్ గురించి స్పందిస్తూ అతడు మంచి స్నేహితుడు మాత్రమేనని అషురెడ్డి వెల్లడించారు.రాహుల్, అషురెడ్డి కుటుంబాల మధ్య ప్రేమ ఉందో లేదో అర్థం కాక అవక్కవ్వడం అభిమానుల వంతవుతోంది.తమ రిలేషన్ గురించి రాహుల్ అషురెడ్డి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తే బాగుంటుందని కొందరు నెటిజన్లు కోరుతున్నారు.