ఎన్టీఆర్ శతజయంతి( NTR Shatajayanthi ) ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( President Draupadi Murmu ) చేతుల మీదగా ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం విడుదల చేయడం తెలిసిందే.ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు నారా కుటుంబ సభ్యుల హాజరయ్యారు.ఈ క్రమంలో ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) ట్విట్టర్ వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు.“ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణెం పూజకు పనికిరాని పువ్వులా మిగిలిపోనుంది.మిగతా కాయిన్స్, కరెన్సీలాగా మార్కెట్ చలామణిలో ఉండదు.దాని విలువను కూడా కేంద్ర ఆర్థిక శాఖ రూ.4,160గా నిర్ణయించింది.చంద్రబాబు గారి బృందం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
మింట్ లో అచ్చు వేసే 12 వేల నాణాలను హెరిటేజ్ తో కొనిపిస్తారా బాబుగారు? చిన్నమ్మా పురందేశ్వరి!( Purandeshwari ) ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది ఏంటమ్మా? భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఆయన ఆత్మను క్షోభకు గురిచేసారే! ఎన్టీఆర్ రూ.100 స్మారక నాణెం కొనుగోలు ధర రూ.4,160.నాణెం తయారీకి 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ వంటి విలువైన లోహాల సమ్మేళనం.సంస్మరణార్ధం గౌరవ సూచికంగా విడుదల చేసే ఇటువంటి నాణాలు చెలామణి కోసం కాదు.
సేకరణ కోసం.అంటే ఆ మహానుభావుడు ఎన్టీఆర్ ని చెల్లని కాయిన్ చేసినట్టేగా బాబుగారు”.
అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.