మన శరీరానికి అవసరమయ్యే అతి ముఖ్యమైన పోషకాల్లో ఐరన్ ఒకటి.శరీర అభివృద్ధి మరియు ఆరోగ్యంలో ఐరన్ కీలక పాత్రను పోషిస్తుంది.
కానీ ఇటీవల కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు.మరీ ముఖ్యంగా మన దేశంలో ఆడవారిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తోంది.
మన దేశంలోని మహిళల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి.ఐరన్ కొరత కారణంగా రక్తహీనత మాత్రమే కాదు మరెన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.
ఈ నేపథ్యంలోనే ఐరన్ లోపాన్ని( Iron deficienc ) ఎలా గుర్తించాలి.? దాని లక్షణాలు ఏంటి.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐరన్ లోపం ఉన్న వారిలో ప్రధానంగా కనిపించే లక్షణం అలసట.చిన్న చిన్న పనులకి చాలా అలసిపోతుంటారు.ఏ పని చేయలేకపోతుంటారు.
చేసే పనిపై ఏకాగ్రత పెట్టలేకపోతుంటారు.ఐరన్ లోపించినప్పుడు బలహీనంగా మారిపోతారు.
కారణం లేకుండానే చిరాకు పడుతూ ఉంటారు.అలాగే ఐరన్ కొరత ఉన్నప్పుడు తరచూ నిద్ర పోవాలని అనిపిస్తుంది.
జుట్టు విపరీతంగా ఊడిపోతుంది( Hair Loss ).ఒక్కోసారి మన చర్మం పాలిపోతుంటుంది.తెల్లగా మారుతుంటుంది.ఇది కూడా ఐరన్ లో పనికి సంకేతం.

శరీరంలో ఐరన్ లోపం తలెత్తినప్పుడు తరచూ తల నొప్పితో బాధపడుతుంటారు.ఐరన్ కంటెంట్ తగ్గడం వల్ల మెదడుకు సరిగ్గా ఆక్సిజన్ అందదు.దాంతో మెదడులోని రక్తనాళాలు వాపుకు గురవుతాయి.ఫలితంగా తలతిరుగుడు, రక్తపోటు తగ్గడం, తలనొప్పి లాంటి లక్షణాలు మొదలవుతాయి.అలాగే కనురెప్పల లోపలి భాగం మరియు చిగుళ్లు తెల్లగా మారినా ఐరన్ లోపం ఉన్నట్టు భావించాలి.ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, చిన్నపాటి శారీరక శ్రమకు ఛాతీలో నొప్పి వంటివి కూడా ఐరన్ లోపం లక్షణాలే.
అలాగే ఐరన్ లోపం వల్ల గుండె కొట్టుకునే తీరులో మార్పులు వస్తాయి.ఐరన్ కొరత ఏర్పడినప్పుడు శరీరం మొత్తానికీ సరిపడా ఆక్సిజన్ అందదు.
శరీరంలో ఆక్సిజన్ తగ్గితే.గుండె సరిగ్గా పనిచేయదు.
ఈ క్రమంలోనే గుండె కట్టుకునే వేగం పెరుగుతంది.ఇటువంటి లక్షణాలు మీలో కనుక కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు.
వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన మందులు వాడండి.లేదా ఇంట్లోనే ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలను డైట్ లో చేర్చుకోండి.
తద్వారా ఐరన్ కొరత నుంచి బయటపడవచ్చు.