తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) ఒకరు.ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండేవారు.
అయితే ఇటీవల సీతారామం ( Sitaramam ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకొని ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇక నేడు విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda) సరసన నటించిన ఫ్యామిలీ స్టార్(Family Star)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక ఈ సినిమా నేడు విడుదలవుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తెలుగు సినిమాలలో నటించడం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు నాకు చిన్నప్పటి నుంచి ఒక మహారాణి పాత్రలో నటించడం చాలా ఇష్టంగా ఉండేది .ఆ కల సీతారామం సినిమా( Sitaramam ) ద్వారా నెరవేరింది అని తెలిపారు.ఇక ఈ సినిమా కోసం మూడు భాషలలో డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందని ఈమె తెలిపారు.
భాష రాకపోతే నటించడం చాలా కష్టమని ఈమె వెల్లడించారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ప్రతిరోజు ఏడ్చేదానినని తెలియజేశారు.తెలుగు రాకపోవడంతో ఆ డైలాగులను ఇంగ్లీష్ లోకి రాసుకొని ప్రాక్టీస్ చేసేదానినని హిందీ, మరాఠీల్లో కంటే.తెలుగులో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టంగా అనిపించింది.
సీతారామం సినిమానే నా మొదటి చివరి సినిమా అవుతుంది అంటూ ఈ సినిమా షూటింగ్ సమయంలో దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan ) తో ఎన్నోసార్లు చెప్పాను కానీ ఆయన నా మాటలు విని నవ్వేవారు.ఈ సినిమా తర్వాత నీకు వరుసగా తెలుగులో అవకాశాలు వస్తాయని కూడా చెప్పేవారు అన్నట్టే ఈ సినిమా మంచి సక్సెస్ కావడం తెలుగులో వరుసగా సినిమాలు రావడం జరిగింది.
అయితే ఇప్పుడు తెలుగు చాలా ఈజీగా మారిపోయిందని మృణాల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.