విజయ్ దేవరకొండ 'ఖుషి' క్లోసింగ్ కలెక్షన్స్..హిట్ టాక్ తో ఇంత నష్టమా!

లైగర్ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) నుండి వచ్చిన చిత్రం ‘ఖుషి ‘.శివ నిర్వాణ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

 Vijay Devarakonda's 'khushi' Closing Collections Hit Talk Is Such A Loss , Vijay-TeluguStop.com

ఓపెనింగ్స్ కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో వచ్చాయి, కానీ లాంగ్ రన్ లో మాత్రం సినిమా నిలబడలేకపోయింది.మంచి టాక్ వచ్చినా కూడా ఎందుకు లాంగ్ రన్ రాలేదు అని ట్రేడ్ పండితులు జుట్టు పీక్కుంటున్నారు.

దీనికంటే తక్కువ టాక్ వచ్చిన రీసెంట్ హిట్ చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ వారం లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి , వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్తుంది.కానీ ‘ఖుషి’ చిత్రం( Khushi movie )లో అద్భుతమైన పాటలు ఉన్నాయి, విజయ్ దేవరకొండ తో పాటు, సమంత లాంటి క్రేజీ హీరోయిన్ కూడా ఉంది.

Telugu Geetha Govindam, Khushi, Samantha, Shiva Nirvana, Tollywood-Movie

అయినా కూడా ఎందుకు వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు.ఈ చిత్రం రన్ దాదాపుగా క్లోసింగ్ కి వచ్చేసినట్టే.ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 54 కోట్ల రూపాయలకు జరుపుకున్న ఈ సినిమాకి కేవలం 42 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.అంటే పది కోట్ల రూపాయలకు పైగానే నష్టం వచ్చింది అన్నమాట.

ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చిన ప్రాంతాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి నైజాం మరియు ఓవర్సీస్ ప్రాంతాలు అని చెప్పొచ్చు.నైజాం లో ఈ చిత్రానికి దాదాపుగా 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

విజయ్ దేవరకొండ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘గీత గోవిందం( Geetha Govindam )’ చిత్రం ఇక్కడ 19 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ఆ తర్వాత ఓవర్సీస్ లో దాదాపుగా 9 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.

రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్ బ్రో చిత్రానికి కూడా ఓవర్సీస్ లో ఇంత వసూళ్లు రాలేదు, బ్లాక్ బస్టర్ రేటింగ్స్ అందుకు కారణం అని చెప్పొచ్చు.

Telugu Geetha Govindam, Khushi, Samantha, Shiva Nirvana, Tollywood-Movie

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు డిజాస్టర్ రేంజ్ అనే చెప్పాలి.సీడెడ్ లో ఈ చిత్రానికి కేవలం రెండు కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఉత్తరాంధ్ర లో 3 కోట్ల రూపాయిలు, ఈస్ట్ గోదావరి లో కోటి 50 లక్షలు, వెస్ట్ గోదావరి లో కోటి 11 లక్షలు, గుంటూరు లో కోటి 40 లక్షలు, అలాగే కృష్ణ జిల్లాలో కోటి 39 లక్షలు, నెల్లూరు లో 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.అలా మొత్తం మీద ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇది విజయ్ దేవరకొండ కెరీర్ లో ఆల్ టైం టాప్ 2 హైయెస్ట్ కలెక్షన్స్ అయిన, కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube