విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన లైగర్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా కు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాడు.
విజయ్ దేవరకొండ గత చిత్రాలు తీవ్రంగా నిరాశ పర్చినా కూడా ఈ సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు పూరి ఈ సినిమా ను తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తూ ఉంటే అర్థం అవుతోంది.
కరీంనగర్ కు చెందిన ఒక తల్లి కొడుకు ముంబయి వెళ్లి అక్కడ ఎదుర్కొన్న సవాల్ల ను ఈ సినిమా కథ గా చూపించినట్లుగా పూరి పేర్కొన్నాడు.విజయ్ దేవరకొండ ఈ సినిమా లో అంతర్జాతీయ స్థాయి బాక్సర్ గా కనిపించబోతున్నాడు.
ప్రస్తుతం సినిమా కోసం భారీ ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు.సినిమా ప్రమోషన్ సూపర్ హిట్ అయ్యింది.
సినిమా కు విపరీతమైన బజ్ క్రియేట్ అవ్వడం తో వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసింది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా లైగర్ ఉంటుందని ప్రచారం చేయడం తో అత్యధికంగా సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్ అవుతున్నాయి.
లైగర్ సినిమా కి హైదరాబాద్ లో దాదాపుగా 550 షో లు మొదటి రోజు పడబోతున్నాయి.విడుదల సమయంకు ఈ సంఖ్య మరో వంద కు పెరిగినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.
కేవలం హైదరాబాద్ లోనే ఈ స్థాయి లో రిలీజ్ అవ్వబోతున్న నేపథ్యం లో ఇప్పటి వరకు హైదరాబాద్ లో దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ నమోదు అయినట్లుగా సమాచారం అందుతోంది.మొదటి రోజు విజయ్ దేవరకొండ అరుదైన రికార్డ్ ను నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పెద్ద ఎత్తున లైగర్ సినిమా ను ప్రమోట్ చేసిన నేపథ్యం లో ఉత్తర భారతంలో కూడా అడ్వాన్స్ బుకింగ్ యమ రేంజ్ లో అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.