విశాఖపట్నం డబ్బు కోసం మనుషులు ఎంతటికైనా తెగిస్తారు.తాజాగా విశాఖ జిల్లాలో ఎదురింటి మహిళ బంగారు గొలుసు కోసం మరో మహిళ పై హత్యాయత్నానికి పాల్పడింది ఆమె చనిపోయిందని భావించి విడిచి పెట్టింది అదృష్టవసాత్తు ఆమె ఆసుపత్రిలో కోలు కొనడంతో నిజం బయటపడింది.
విశాఖ జిల్లా భీమిలి రామాలయం వీధిలో కొయ్య ఈశ్వరమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది పిల్లలు పెద్దయి వివాహం చేసుకోవడంతో ఈశ్వరమ్మ ఒంటరిగా ఉంటుంది.ఎదురింట్లో కొయ్య పద్మ అనే మహిళ నివాసం ఉంటుంది.
ఇద్దరి మధ్య స్నేహబంధం ఉండడంతో అప్పుడప్పుడు ఈశ్వరమ్మ వద్ద ఉన్న పుస్తెలతాడును పద్మ తీసుకుని వెళ్ళేది.ఇటీవల పద్మ పెద్ద మొత్తంలో అప్పులు పాలవడంతో ఆమెపై ఒత్తిడి పెరిగింది ఈ దశలో బంధువుల ఇంటికి వెళ్తానని పద్మ పుస్తెలతాడు ఈశ్వరమ్మకు అడిగింది దీనికి ఆమె నిరాకరించడంతో కత్తితో దాడి చేసి విచక్షణ రహితంగా గాయపరిచింది ఆమె చనిపోయిందని భావించి పుస్తెలతాడును ఎత్తుకుపోయింది.
కాగా గాయపడిన ఈశ్వరమ్మ ను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు రెండు రోజుల తర్వాత కోలుకున్న ఈశ్వరమ్మ తనపై ఎదురింటి పద్మ దాడి చేసి పుస్తెలతాడు ఎత్తుకుపోయిందని నిజం చెప్పింది ఈ మేరకు ఆమెను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు
.