కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా వారసుడు. తమిళ్ లో ‘వరిసు’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సినిమాపై ఇప్పటికే తమిళ్ లో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
ఇది ముందు బైలింగ్వన్ సినిమా అని చెప్పిన మేకర్స్ ఇటీవల డైరెక్ట్ తమిళ్ సినిమా అని చెప్పడంతో తెలుగు ప్రేక్షకులు అయితే ఈ సినిమాపై గుర్రుగా ఉన్నారు.
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
తమిళ్ లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్ ఇప్పుడు తెలుగులో కూడా మెప్పించడానికి టాలీవుడ్ డైరెక్టర్ తో రాబోతున్నాడు.కానీ ఇది తెలుగు సినిమా కాకపోవడంతో ఇక్కడ ఇప్పటి వరకు పెద్ద అంచనాలు అయితే రాలేదు.
దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రాబోతుంది.ఇప్పటికే ఈ సాంగ్ ప్రోమో వచ్చింది.
ఇక ఫుల్ సాంగ్ ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలోనే క్రేజీ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ సాంగ్ కౌండౌన్ స్టార్ట్ చేసారు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి రంజితమే అనే పల్లవితో సాగుతున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఈ రోజు సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు రాబోతుంది.తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో బాగా ఆకట్టుకుంటుంది.
ఎంత అయినా తెలుగు నిర్మాత, డైరెక్టర్ కావడంతో వీరి లుక్స్ లో తెలుగు నేటివిటీ బాగా కనిపిస్తుంది.అలాగే మాస్ షేడ్స్ కూడా బాగా కనిపించడంతో ఈ సాంగ్ పై మన ఫ్యాన్స్ కు కొద్దిగా క్యూరియాసిటీ అయితే వచ్చింది.