నాగార్జున, ఎన్టీఆర్ ఆ రంగంలో సక్సెస్ కావడానికి వెంకటేశ్ కారణమా.. ఆయన వల్లే ఎదిగారా?

కొన్ని విషయాలు వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఆ విషయాలను నమ్మకుండా ఉండలేము.బిగ్ బాస్ షోకు హోస్ట్ లుగా వ్యవహరించి నాగార్జున, ఎన్టీఆర్ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించారనే సంగతి తెలిసిందే.

 Venkatesh Is The Reason For Ntr Nagarjuna Success Details Here , Venkatesh, Nag-TeluguStop.com

అయితే వాళ్లు ఈ షోకు హోస్ట్ గా చేయడానికి పరోక్షంగా వెంకటేశ్ కారణం కావడం గమనార్హం.మొదట వెంకటేశ్( Venkatesh ) కు బిగ్ బాస్ షోకు హోస్ట్ గా పని చేసే అవకాశం దక్కింది.

అయితే ఆయన ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించడం వల్ల నాగార్జున, ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా పని చేసే అద్భుతమైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారని చెప్పాలి.అమెరికాలో ఎంబీఏ చదివిన వెంకటేశ్ మొదట బిజినెస్ చేయాలని అనుకున్నా కలియుగ పాండవులు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.

అద్దం ముందు తాను ప్రాక్టీస్ చేసేవాడినని అద్దమే తనాకు ఫిల్మ్ స్కూల్ అని వెంకటేశ్ చెబుతున్నారు.

Telugu Bigg Boss, Jr Ntr, Meeloevaru, Nagarjuna, Tollywood, Venkatesh-Movie

వెంకటేశ్ క్రికెట్ ను ఎంతో ఇష్టపడతారు.బిగ్ బాస్ షోతో పాటు మీలో ఎవరు కోటీశ్వరుడు( Meelo Evaru Koteeswarudu ) షోలకు హోస్ట్ గా చేసే ఆఫర్ వచ్చినా వేర్వేరు కారణాల వల్ల ఆయన వదులుకున్నారు.ప్రతిరోజూ ధ్యానం చేసే వెంకీ కర్మ సిద్దాంతాన్ని నమ్ముతారు.విక్టరీ వెంకటేశ్ కు ఇప్పటివరకు ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.30 కంటే ఎక్కువ రీమేక్ సినిమాలలో విక్టరీ వెంకటేశ్ నటించారు.

Telugu Bigg Boss, Jr Ntr, Meeloevaru, Nagarjuna, Tollywood, Venkatesh-Movie

ఇతర హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేసే విషయంలో సైతం వెంకటేశ్ ముందువరసలో ఉంటారు.టైటిల్స్ చివర్లో రా ఉంటే హిట్టావుతుందని వెంకటేశ్ సినిమాలలో ఎక్కువ సినిమాలు ప్రూవ్ చేశాయి.లక్ష్మి, తులసి లాంటి విభిన్నమైన టైటిల్స్ తో వెంకటేశ్ సినిమాలు చేశారు.సైంధవ్ సినిమాతో వెంకటేశ్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube