దాసరిపై నమ్మకం లేదన్న శోభన్ బాబు.. తర్వాత ఎందుకు బాధపడ్డాడో తెలుసా?

దాస‌రి నారాయ‌ణ‌రావు.తెలుగు సినిమా రంగానికి పెద్ద దిక్కుగా నిలిచిన వ్యక్తి.

 Untold Story Of Dasari And Sobhan Babu, Dasari Narayana Rao, Shobhan Babu, Prat-TeluguStop.com

తను బతికినంత కాలం సినిమా పరిశ్రమకు ఎనలేని సేవ చేశాడు.నటుడిగా, దర్శకుడిగా ఎన్నో అద్భుత సినిమాలు చేశాడు.

ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకున్నాడు.ఎన్నో వివాదాలన పరిష్కరించాడు కూడా.

తను తుది శ్వాస విడిచే వరకు కళామతల్లి సేవలోనే కొనసాగాడు.అయితే తను 1973లో దర్శకుడిగా సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు.

ఆ సినిమా సమయంలో తనకు ఓ ఎదురు దెబ్బ తగిలింది.ఇంతకీ అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దాసరి దర్శకుడిగా తీసిన తొలి సినిమా తాత మనువడు.ప్ర‌తాప్ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కె.రాఘ‌వ నిర్మించిన ఫస్ట్ మూవీ కూడా అదే.ఈ సినిమాలో ఎస్వీరంగారావు, రాజబాబు టైటిల్ రోల్స్ చేశారు.నిజానికి ఈ సినిమాలో రాజబాబు పాత్రను శోభన్ బాబు చేయాల్సి ఉండేది.ఆ పాత్రను శోభన్ బాబు చేయాలని కోరాడు నిర్మాత రాఘవ.అయితే శోభన్ బాబు నో చెప్పాడు.దర్శకుడు కొత్తవాడు.

ఏం తీస్తోడో తెలియదు.నాతో ప్రయోగాలు వద్దు.

తర్వాత సినిమా చేద్దాం అఅని చెప్పాడు.ఆయన నో చెప్పడంతో ఆ క్యారెక్టర్ ను రాజబాబుతో ఫుల్ ఫిల్ చేశాడు దాసరి.

ఈ సినిమా అప్పట్లో సంచనల విజయం సాధించింది.సినిమా పరిశ్రమను ఊపు ఊపింది.

Telugu Abhimanyudu, Dasari Yana Rao, Deeparadhana, Jagan, Raghava, Krishnarjuna,

దాసరిని తక్కువ అంచనా వేసినందుకు శోభన్ బాబు చాలా బాధపడ్డాడట.ఆ తర్వాత తన నుంచి ఏ ఆఫర్ వచ్చినా.నో అనే మాట చెప్పలేదట.డేట్స్ కుదరకపోతే మాత్రం విషయం చెప్పవాడట.అంతేకాదు.దాసరి సినిమా అంటే ఏనాడు స్టోరీ అడిగేవాడు కాదట.

అంతేకాదు.వీరిద్దరు బావా అని పిలుచుకునేవారట.

ఎంతో సన్నిహితంగా మెలిగేవారట.ఇద్దరు సెట్స్ లో ఉంటే చాలా సరదాగా ఉండేదట.

వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి సినిమా బలిపీఠం.ఈ సినిమా ఓ రేంజిలో విజయం సాధించింది.

ఈ సినిమా తర్వాత వచ్చిన మరో మూవీ గోరింటాకు.ఈ సినిమా సైతం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

వీరిద్దరు చేసిన దీపారాధ‌న‌, కృష్ణార్జునులు, స్వ‌యంవ‌రం, జ‌గ‌న్‌, అభిమ‌న్యుడు, ధ‌ర్మ‌పీఠం ద‌ద్ద‌రిల్లింది సహా పలు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube