సినిమా ఫ్యాన్స్ తమ హీరోలను చాలా అభిమానిస్తారు.వారికోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతారు.
వారి ఫేవరెట్ హీరో తీసే ప్రతి సినిమాకి వెళ్తారు.సినిమా బాగోలేకపోయినా బాగుందని చెప్తారు.
ఎవరైనా బాగోలేదంటే వారిపై విరుచుకుపడతారు.సింపుల్‌గా చెప్పాలంటే వారి ఫేవరెట్ హీరోను ఒక దేవుడు లాగా భావిస్తారు.
హీరోలు కూడా మనలాంటి సామాన్యులేనని ఎన్నడూ అర్థం చేసుకోరు.వ్యక్తి పూజలకు పోయి వారు ఇబ్బంది పడడమే కాక ఇతరులను కూడా ఇబ్బందులకు గురిచేస్తారు.
సెల్ఫీలు తీసుకుంటామని హీరోల వద్దకు వెళ్లి తిట్టించుకున్న అభిమానుల ఉన్నారు.బాలయ్య చేత కొట్టించుకున్న వారు కూడా ఉన్నారు.
అయితే ఇది నాణేనికి ఒక వైపే మాత్రమే.వీరు తమ హీరోని ఎంతగా ప్రేమిస్తారో, వేరే హీరోను అంతగా ద్వేషిస్తారు.
తమ హీరోని మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతారు కానీ వేరే వారిని ట్రోల్ చేస్తూ దారుణంగా అవమానిస్తారు.ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే చాలు ఆ హీరోకి సోషల్ మీడియాలో ట్రోలింగ్ తప్పదు.
ఇలాంటి ట్రోలింగ్ బారిన పడి బాగా భయపడిపోయి జాగ్రత్తలు తీసుకుంటున్న హీరోలు కూడా ఉన్నారు.మళ్లీ వారి ట్రోలింగ్ బారిన పడొద్దనే ఉద్దేశంతో సినిమా స్టోరీలను ఎంచుకునే విధానాన్ని మార్చుకున్న వారు కూడా ఉన్నారు.
ఉదాహరణకు మహేష్ బాబు.ఒకప్పుడు చాలా ప్రయోగాత్మక సినిమాలు తీస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త బెంచ్ మార్క్స్ సెట్ చేయాలని మహేష్( Mahesh babu ) అనుకున్నాడు.
ఆ క్రమంలో కొన్ని ఫ్లాప్స్ అందుకున్నాడు.దానికే చాలామంది అతడిని దారుణంగా ట్రోల్ చేశారు.దాంతో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను మాత్రమే తీస్తున్నాడు.మినిమం గ్యారెంటీ ఉండేలా చూసుకుంటున్నాడు.కొత్త కాన్సెప్ట్ ల జోలికి వెళ్లకుండా సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, గుంటూరు కారం లాంటి మసాలా ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు తీస్తున్నాడు.వీరి ట్రోలింగ్స్ వల్ల బాగా ఎఫెక్ట్ అయిన వారిలో అల్లు అర్జున్( Allu Arjun ) కూడా ఒకరు.
అల్లు అర్జున్ చాలా హార్ట్‌ఫుల్ గా నవ్వుతాడు. ఫేక్ స్మైల్ ఇచ్చే రకం కాదు.
చాలా మనస్ఫూర్తిగా, ఎలాంటి కల్మషం లేకుండా నవ్వుతాడు.అయితే ఆ నవ్వును ఇతర హీరోల అభిమానులు కావాలనే ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
చాలా రోజులుగా మీమ్స్ లో అల్లు అర్జున్ నవ్వును ట్రోల్ చేస్తూ అవమానపరిచారు.చివరికి ఇది బన్నీ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలిసింది.
దీనివల్ల తాను బాధపడినట్లు అర్థమవుతోంది.
ఇటీవల మంగళవారం సినిమా ఈవెంట్ ( Mangalavaaram movie )లో పాల్గొన్న అల్లు అర్జున్ మనస్ఫూర్తిగా నవ్వలేకపోయాడు.తన ముఖానికి చెయ్యి అడ్డుపెట్టుకొని చిన్నగా నవ్వాడు.దీన్ని బట్టి చూస్తుంటే అతడు ఎంతో నొచ్చుకున్నట్లు తెలుస్తోంది.
కాన్ఫిడెన్స్ కూడా బాగా కోల్పోయినట్లు అర్థమవుతుంది.ఏదేమైనా ఒకరిపై నెగిటివ్ ఎఫెక్ట్ పడేలాగా అభిమానులు టార్గెట్ చేయడం నిజంగా బాధాకరం.
మహేష్ బాబు కూడా స్వేచ్ఛగా సినిమా స్క్రిప్టే ఎంచుకోకపోవడానికి ప్రేక్షకుల ట్రోలింగ్ ఏ కారణం.వారు కూడా మనుషులేనని ఇలా ట్రోల్స్ చేస్తే నొచ్చుకుంటారని ట్రోలర్స్ అస్సలు అర్థం చేసుకోకపోవచ్చు.