అజయ్ భూపతి( Ajay Bhupathi ) డైరెక్షన్ లో పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో వచ్చిన మంగళవారం సినిమా మంచి విజయాన్ని దక్కించుకొని ముందుకు సాగుతుంది.ఇక ఈ సినిమాలో అజయ్ భూపతి, తనదైన మేకింగ్ స్టైల్ చూపిస్తూ ఈ సినిమాను ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు.
ఇక ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులు ప్రతిక్షణం ఉత్కంఠ కి లోనవుతూ సైలెంట్ గా సీటు ఎడ్జ్ లో కూర్చొని సినిమా చూసే విధంగా డైరెక్టర్ సినిమాను డిజైన్ చేశాడు.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్( Payal Rajput ) కంటే ముందు వేరే వాళ్ళను అనుకున్నారు.
కానీ వాళ్ళు నో చెప్పడం తో ఆ క్యారెక్టర్ పాయల్ రాజ్ పుత్ దగ్గరికి రావడం జరిగింది.
అయితే అలాగే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉంటుంది అది చివర్లో ఒక 15 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది కానీ ఈ సినిమా మొత్తం లో ఆ పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.అయితే ఆ క్యారెక్టర్ లో హీరో కార్తికేయని చేయమని డైరెక్టర్ అజయ్ భూపతి అడిగగా కార్తికేయ కొంచం బిజీ లో ఉండి ఈ సినిమా చేయలేకపోయాడు.ఇక దాంతో ఈ క్యారెక్టర్ లోకి ఎవరిని తీసుకుందామని అనుకున్నా అజయ్ భూపతి కి ప్రియదర్శి( preyadarshe ) అయితే బాగుంటాడు అని అనిపించి అప్పుడు ప్రియదర్శి ని ఆ క్యారెక్టర్ లోకి తీసుకోవడం జరిగింది.
నిజానికి ఆ క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది.
ఇక రీసెంట్ గా బలగం సినిమా( Balagam Movie )తో మంచి విజయాన్ని అందుకున్న ప్రియదర్శి కి ఇది కూడా ఒక మంచి క్యారెక్టర్ అవుతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించడంతో కార్తికేయ ఈ క్యారెక్టర్ మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడుతున్నడని తెలుస్తుంది…
.